BigTV English

Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గాజు గ్లాస్ డైలాగ్.. ఈసీ రియాక్షన్..

Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గాజు గ్లాస్ డైలాగ్.. ఈసీ రియాక్షన్..

Ustad Bhagat Singh TeaserAP CEO Reaction on Ustaad Bhagat singh Teaser (Andhra news updates): జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృదం మంగళవారం విడుదల చేసింది. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ గాజు గ్లాసుకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ చెప్పారు. ఈ టీజర్ ద్వారా పవన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ ప్రచారం జరగడంతో ఈసీ దీనిపై స్పందించింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని టీజర్ మంగళవారం విడుదలైంది. అయితే ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గాజు గ్లాసును చూపిస్తు చెప్పిన డైలాగ్స్ పై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా స్పందించారు. బుధవారం ముకేష్ కుమార్ మీనా నిర్వహించిన మీడియా సమావేశంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తానింకా టీజర్ చూడలేదని.. చూసిన తర్వత దీనిపై స్పందిస్తామన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని.. ఇది పొలిటికల్ యాడ్ అయితే మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి భగత్స్ బ్లేజ్ పేరుతో మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ విడియోలో విలన్ పవన్ కళ్యాణ్ ను చూస్తు.. ఇది నీ రేంజ్ అంటూ గాజు గ్లాసును కిందపడేస్తాడు. ఆ తర్వాత గాజు గ్లాసు ముక్కలను చేతిలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్.. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది.. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ పవన్ పోలీస్ పాత్రలో విలన్ తో మాస్ డైలాగ్ చెప్తాడు. ప్రస్తతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మెగిన నేపథ్యంలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును వినియోగించి డైలాగ్స్ చెప్పడంపై రాజకీయంగా చర్చ మొదలైంది.


Also Read: AP Elections: ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. వాలంటీర్లపై వేటు..

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ పై ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా స్పందించారు. తాను ఇంకా టీజర్ చూడదేన్నారు. అంతవరకు తాను ఏమీ మాట్లాడలేన్నారు. అయితే గ్లాస్ చూపించి పబ్లిషిటీ చేస్తే పొలిటికల్ యాడ్ కిందకు వస్తుందన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రకటనలు చేయడం తప్పుకాదని.. అలా చేయాలంటే తప్పనిసరిగా ఈసీ పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈ టీజర్ ఓ పొలిటికల్ యాడ్ అయితే తప్పకుండా వారికి నోటీసులు అందిస్తామన్నారు. ఆ తర్వాత వారు రీసర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ టీజర్ పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలిస్తామని తెలియజేశారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×