BigTV English

AP IPS Raghuramreddy New Posting: అస్సాంకు రఘురామ్‌రెడ్డి.. జగన్‌కు షాకింగ్..? అందుకోసమేనా..?

AP IPS Raghuramreddy New Posting: అస్సాంకు రఘురామ్‌రెడ్డి.. జగన్‌కు షాకింగ్..? అందుకోసమేనా..?
AP IPS Officer Raghuram Reddy Posting in Assam as Election Observer
AP IPS Officer Raghuram Reddy Posting in Assam as Election Observer

AP IPS Officer Raghuram Reddy Posting in Assam as Election Observer: లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్ సభతోపాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 19 ఐపీఎస్‌లు సీఈసీకి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతుండగానే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.


జగన్ సర్కార్‌లో కీలకంగా ఉన్న ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డిని ఏపీ నుంచి బయటకు పంపింది. ఆయనను అస్సాంలోని ఎన్నికల పోలీసు అబ్జర్వర్‌గా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసిన ఎన్నికల సంఘం, తాజాగా రఘురామ్‌రెడ్డిని ఏపీ నుంచి దూరంగా పెట్టింది. ఈ మేరకు సోమవారం సాయంత్ర ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అస్సాంలోని 10 నియోజకవర్గాలకు పోలీసు అబ్జర్వర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు ఐపీఎస్ అధికారి రఘురామిరెడ్డి. దీంతో ఏపీ నుంచి అస్సాంకు ఆయన వెళ్లనున్నారు. అక్కడే విధులు నిర్వహించ నున్నారు. జగన్ అధికారంలోకి రాగానే రఘురామ్‌రెడ్డిని ఏరికోరి తెచ్చుకుంది వైసీపీ సర్కార్. ముఖ్యంగా రాజధాని భూములపై వేసిన సిట్ కమిటీకి ఆయనే అధిపతి. అంతేకాదు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారి కూడా. ఆయన సిన్సియార్టీని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అస్సాంలో కీలక బాధ్యతలు అప్పగించింది.


Also Read: MLC Iqbal joining tdp: వైసీపీకి మరో షాక్, టీడీపీలోకి ఎమ్మెల్సీ ఇక్బాల్, కారణం అదేనా?

జగన్ సర్కార్ ఐపీఎస్ అధికారి రఘురామ్‌రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగం, ఔషధ నియంత్రణ మండలి డీజీగా నియమించింది. ఈ క్రమంలో మాజీ మంత్రి నారాయణ కళాశాలు, నివాసంపై ఆయన సోదాలు చేశారు.

గత ఎన్నికల వరకు సాధారణ పరిశీలకులు మాత్రమే ఉండేవారు. అయితే ఎన్నికలు మరింత స్వేచ్ఛగా నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్రం ఎన్నికల సంఘం ఈసారి పోలీసు అబ్జర్వర్లను నియమించింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా పంపిస్తోంది.

ఇదిలావుండగా సోమవారం ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద కొన్ని పేపర్లను దహనం చేశారు. అందులో సీఐడీ నమోదు చేసిన కేసుల్లో హెరిటేజ్‌కు చెందిన డాక్యుమెంట్లు ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలను గమనించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు.. ఎన్నికల సంఘానికి నివేదికలు పంపినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన్ని అస్సాంకు పంపించారని అంటున్నారు.

Also Read: జగన్ కాన్వాయ్‌లోకి ఆ యువకుడు.. భద్రతా వైఫల్యమా? మరో కోడికత్తి డ్రామానా?

ప్రస్తుత పరిణామాన్ని గమనించిన కొందరు నేతలు.. ఎన్నికల ముందు సీఎం జగన్‌కు ఊహించని షాక్‌గా చెబుతున్నారు. అంతేకాదు సిన్సియర్‌గా పనిచేసిన ఐఏఎస్‌లకు మరో దగ్గర పోస్టింగ్ ఇచ్చే అవకాశ ముందని అంటున్నారు. ఇటీవల పలువురు ఐపీఎస్‌లు సీఈసీకి లేఖ రాయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అందుకోసమే తెలివిగా విధులకు దూరం పెట్టకుండా అధికారులుగా మరో రాష్ట్రానికి సీఈసీ పంపిస్తోందని అంటున్నారు. ఏదేమైనా ఫ్యాన్ పార్టీకి ఇది ఊహించని ఝలక్.

Related News

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Big Stories

×