E-Paper
Advertisement

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్
Advertisement

Malayalam Mystery Drama: ఈతరం యూత్ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాల గురించి ఎంత ఆబ్సెస్డ్ గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ దానివల్ల వచ్చే అనవసరమైన వివాదాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ఒకరి ప్రశాంతమైన జీవితాన్ని ఎలా ముక్కలు చేస్తుంది ? అన్నది తెలుసుకోవాలంటే ‘థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ’ (Theatre The Myth of Reality) అనే ఈ మలయాళం సినిమాను చూడాల్సిందే.

కథలోకి వెళ్తే…

కేరళలోని ఒక మారుమూల ద్వీపంలో ఉన్న పవిత్రమైన దేవతా వనం నేపథ్యంలో కథ నడుస్తుంది. మీరా మన హీరోయిన్ పేరు. ఆమె తల్లితో కలిసి బయట ప్రపంచానికి, ఆధునిక సాంకేతికతకు దూరంగా నివసిస్తుంటారు. సమాజం, బంధువులు వాళ్ళను వెలివేస్తారు. కానీ వాళ్ళు మాత్రం తమ సాంప్రదాయ నమ్మకాలు, ఆచారాలు, దైవ భక్తితో… ఎవ్వరూ లేని ఆ ప్రదేశంలో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో, ఆ ద్వీపంలో ఒక వింతైన ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తుతుంది.

Advertisement

ఆ సమయంలో వారు చేసే కొన్ని పనులు, ప్రవర్తనను ఎవరో ఒకరు ఒక చిన్న వీడియో క్లిప్‌గా రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిపోతుంది. రాత్రికి రాత్రి వాళ్ళ జీవితం పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్ళిపోతుంది .ఆ ఒక్క వైరల్ వీడియోతో వారి ప్రశాంతమైన జీవితం కాస్తా పబ్లిక్ టాపిక్‌గా మారిపోతుంది. నెటిజన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆ తల్లికూతుళ్ల జీవితాన్ని, వారి నమ్మకాలను తమకు నచ్చినట్లుగా విశ్లేషించడం, ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు.

కొందరు వారిని మూఢనమ్మకాలు పాటించే వెనకబడిన వారుగా చిత్రీకరిస్తే, మరికొందరు ఆధ్యాత్మిక గురువులుగా భావిస్తారు. డిజిటల్ ప్రపంచం సృష్టించే అబద్ధపు నిజాలు వాస్తవ జీవితానికి ఎంత దూరంగా ఉంటాయో ఈ సినిమాను చూస్తే అర్థం అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయికి వచ్చిన వ్యాధి ఏంటి ? దానికి సోషల్ మీడియాలో అంత ట్రోలింగ్ ఎందుకు జరిగింది ? ఆ ప్రభావం వాళ్ళపై ఎలా పడింది ? చివరకు ఆ తల్లీకూతుర్లు ఏమయ్యారు ? అన్నది ఈ సినిమాలో చూసి తెలుసుకోవలసిన అంశం.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

అవార్డు విన్నింగ్ మలయాళ మిస్టరీ డ్రామా ‘థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ’. రీమా కల్లింగల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సజిన్ బాబు దర్శకత్వం వహించారు. ManoramaMax, Amazon Prime Videoలలో మలయాళం భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. 2025లో విడుదలైన ఈ మలయాళం మాస్టర్ పీస్ ను ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి. ముఖ్యంగా సోషల్ మీడియాను వాడే వాళ్ళు అసలు మిస్ అవ్వొద్దు.

Read Also: కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×