BigTV English

Ugadi Horoscope: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..?

Ugadi Horoscope: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..?
Ugadi Horoscope
Ugadi Horoscope

Ugadi Rasi Phalalu 2024 To 2025 Telugu: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..?


మేష రాశి..
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3, ఆర్దిక పరంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. మేష రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. ఆదిత్య హృదయ పారాణి చేయడం గాని, దుర్గా సప్తసిధి పారాణి చేస్తే చాలా మంచి జరుగుతుంది.

వృషభ రాశి..
ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3, వృషభ రాశి వారికి రాహు యొక్క బలం వల్ల ఆర్దిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. సర్వకార్య విజయం లభించే అవకాశం ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభం కలగే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా కూడా కొద్దిగా జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్లాలి. తప్పకుండ వీళ్లు భయం తొలగిపోవడానికి ఆంజనేయ స్వామి ఆరాధన, ఓం నమః శివాయ పంచాక్షరి చేస్తే మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.


మిథునం..
ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6 ఆదాయం మెండుగా ఉంటుంది కాని దానికి తగ్గట్టుగా కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. గతం కంటే ఈసారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహాది శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్లేటప్పుడు కొంచె జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మేలు జరుగుతుంది.

Also Read: క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, బ్రహ్మ సృష్టించిన..

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6, కర్కాటక రాశి వారికి ఈ క్రోధి  నామ సంవత్సరంలో ముఖ్యంగా గురవు వల్ల లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్ధిక ఆదాయం బాగా పెరుగుతుంది. అనుకున్న పనులన్ని నెరవేరతాయి. కోర్టు సమస్యల పరిష్కారం అవుతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. స్త్రీ , పురుషులకు వివాహం కాని వారికి వివాహం కలగటం, సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు అనుకూలంగా ఉంటుంది. కర్కాట రాశి వారికి అష్టమస్థానంలో శని వచ్చే సంవత్సరం అలానే మార్చి 29వ తారీఖు 2025 శని యొక్క దోషం పోతుంది. నల్లని ద్రాక్షారసంతోటి శనికి అభిషేకం చేయడం వల్ల దోషం అనేది తొలగి పోతుంది.

సింహం..
ఆదాయం 2 వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్లన మంచి ఫలితం ఉంటుంది.

కన్య..

ఆదాయం 5 వ్యయం 5,రాజపూజ్యం 5, అవమానం 2 ఆర్ధిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. విద్యార్దులకు అనుకూలమైన కాలం. వివాహం కాని స్త్రీ , పురుషులకు వివాహం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అమ్మవారిని ఆరాదన చేయడం వల్లన మంచి ఫలితం ఉంటుంది.

Also Read: Significance of Ugadi: యుగయుగాల ఉగాది.. వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా..?

తుల..
ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5, ఆర్ధిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి దానిలో విజయం సాధిస్తారు. కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్నికుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్షీ సహస్రనామం చదివితే మంచి ఫలితం ఉంటుంది.

దనస్సు..
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5 , ఆర్ధిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసుకు చిరాకుపరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోను మానకండి. ఇష్టదైన సందర్శన శుభప్రదం.

మకరరాశి..
ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1, ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విద్యార్ధులకు విశ్వవిద్యాలయాల్లో సీటు లభించే అవకాశావు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. నలుగురుకి ఆదర్శంగా నిలుస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. సూర్యనారాయణ మూర్తి ఆరాధన మంచి ఫలాతాన్ని ఇస్తుంది.

Also Read: Ugadi Special Wishes: క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, బ్రహ్మ సృష్టించిన..!

కుంభం..
ఆదాయం 14, వ్యయం 14,రాజపూజ్యం 6, అవమానం 1, ఆర్ధిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్ధులకు కొంత లోపంగా ఉండే అవకాశం ఉంటుంది. భార్యా భర్తల మధ్య సఖ్యత చాలా ముఖ్యం. ధార్మిక కార్యాక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి పనులో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఆదిత్య హృదయ పారాణి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మీన రాశి..
ఆదాయం 11, వ్యయం 5,రాజపూజ్యం 2, అవమానం 4, ఆర్ధిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కార్యసిద్ది విశేషంగా ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×