Big Stories

Ex CM’s Targets Peddireddy: మాజీ సీఎంల టార్గెట్..పెద్దిరెడ్డికి గడ్డుకాలమేనా..?

Chandrababu, Kiran Kumar Reddy Target Peddireddy
Chandrababu, Kiran Kumar Reddy Target Peddireddy

Chandrababu, Kiran Kumar Reddy Targeted Peddireddy: మాజీ సీఎంలు కిరణ్, చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరు ఇప్పుడా ఇద్దరు ఎక్స్ సీఎంలు ఆ జిల్లాకే చెందిన వైసీపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. పుంగనూరు నుంచి పోటీలో ఉన్న పెద్దిరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు.. రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.. అక్కడ పెద్దిరెడ్డి వారసుడు మిథున్‌రెడ్డికి చెక్ పెట్టడానికి రెడీ అయ్యారు. అటు పెద్దిరెడ్డి సైతం అటు కుప్పంలో చంద్రబాబుని ఇటు కిరణ్‌ని ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ముగ్గురు దిగ్గజాల మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ వార్‌తో చిత్తూరు జిల్లా రాజకీయాలు హాట్ హట్ గా మారాయి.

- Advertisement -

చిత్తూరోళ్ల రాజకీయం ఉత్కంఠభరితంగా మారింది. చిత్తూరు జిల్లా వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో వరుసగా నాలుగో సారి గెలవడానికి రెడీ అయ్యారు. ఆయన కొడుకు మిధున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు. మరోవైపు ముందునుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి బద్దశత్రువులుగా ఉంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన కుప్పంలో విజయపరంపర కొనసాగించడానికి సిద్దమయ్యారు. జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టాలని చూస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తోడయ్యారు.

- Advertisement -

జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబానికి మంచి పట్టుంది. అక్కడి నుంచి గెలిచే కిరణ్ ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలతో కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు .. ఆయన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పీలేరు నుంచి జనసేన, టీడీపీల నుంచి పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ  నియోజకవర్గంలో తన పట్టు కొనసాగిస్తున్నారు. అక్కడ పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఈ సారి ఓడించడానికి పావులు కదుపుతున్నారు.

Also Read: అనుకున్నది ఒకటి ఐనది ఒకటి.. ఇద్దరికి హ్యాండే

నల్లారి, పెద్దిరెడ్డిలకి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే విభేదాలున్నాయి.. ఒకే పార్టీలో ఉన్నా బద్ద శత్రువుల్లా వ్యవహరిస్తూ వచ్చారు.. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా మిధున్‌రెడ్డిపై పోటీకి దిగారు .. కుప్పంలో తనను ఓడిస్తానంటున్న పెద్దిరెడ్డికి పుంగనూరులో చెక్ పెట్టడానికి బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న చల్లా బాబుని రంగంలోకి దించారు .. చల్లాబాబు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడైన పెద్దిరెడ్డికి ఈసారి ఓడిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు..

ప్రస్తుతం రాయలసీమ జిల్లాలలో వైసీపీ రాజకీయాలను పెద్దిరెడ్డి శాసిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు మొదలు అభ్యర్థుల ఎంపిక వరకు అంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుంది. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో.. అవసరమైన సమయంలో వైసీపీ నేతలను ఆర్థికంగా ఆదుకుంటున్నది కూడా పెద్దిరెడ్డే. రాజకీయంగా రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉండి జిల్లా రాజకీయలను చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం, పదేళ్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డి పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించకపోవడంతో జిల్లాలో పెద్దిరెడ్డికి ఎదురు లేకుండా పోయింది‌.

చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కడం వెనక పెద్దిరెడ్డి కీలక పాత్ర వహించారు … గత ఎన్నికల్లో తన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డిని తంబల్లపల్లి ఎమ్మెల్మేగా, కొడుకు మిధున్‌రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించుకున్నారు .. ఈ సారి పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఆ ముగ్గురూ పోటీలో ఉంటే … ఆయన్ని బద్ద శత్రువుగా చూసే చంద్రబాబు, నల్లారి సోదరులు ఇద్దరూ బరిలో ఉండటంతో ఎన్నికలు అందరికీ వ్యక్తిగత ప్రతిష్టగా మారాయి.

Also Read: janasena announced palakonda: జయకృష్ణకే సీటు, కళావతితో ఢీ అంటే ఢీ

జిల్లా రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డిని సొంత సెగ్మెంట్ పుంగనూరులో ఓడించడానికి ఈ సారి ఆయనకు బలమైన ప్రత్యర్థిగా చల్లా బాబును ఎంపిక చేశారు చంద్రబాబు .. పెద్దిరెడ్డిని కట్టడి చేసి జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది … ఇప్పటికే కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి అక్కడ వైసీపీ అభ్యర్ధి భరత్ గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్నారు పెద్దిరెడ్డి .. ఆ క్రమంలో ఇటీవల చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు.. తనను ఓడించడానికి పుంగనూరు పుడింగి కుప్పం వచ్చడని … పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడిస్తానని సవాల్ విసిరారు చంద్రబాబు…

మరోవైపు మిత్రపక్షం బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా చంద్రబాబుకు జత కలిసారు మాజీ సీఎం కిరణ్ .. రాజంపేట ఎంపీగా రెండు సార్లు గెలిచిన మిధున్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు .. మిధున్‌ని ఓడించి పెద్దిరెడ్డి కుటుంబంపై పైచేయి సాధించాలని చూస్తున్నారు … ఇలా ఇద్దరు మాజీ సిఎంలు ఒకరు తండ్రినీ, మరొకరు కొడుకుని టార్గెట్ చేయడంపై హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి… అయితే ఇన్నాళ్ళూ సరైన అభ్యర్థి లేకపోవడంతో రెండు సార్లు తండ్రి, కొడుకులు గెలిచారని ఇప్పుడు అసలు ఆట మొదలైందని నల్లారి అనుచరులు అంటున్నారు.

బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా జిల్లాలోకి రావడం రావడమే కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట, పుంగనూరు,తంబల్లపల్లి లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను,ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేశారని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారని ఫైర్ అయ్యారు. ఇక వారి లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలాచిన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పుంగనూరులో టీడీపీ అభ్యర్ధి చల్లా బాబుతో కలిసి ప్రచారం నిర్వహించిన కిరణ్ పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు

Also Read: బీజేపీ సీబీఐ రాగం.. అసలు కథేంటి?

అదలా ఉంటే పెద్దిరెడ్డి ఎఫెక్ట్‌తో చిత్తూరు జిల్లాలో చాలాకాలంగా సైలెంట్ అయిన రెడ్డి ప్రముఖులు ఇప్పుడు నల్లారి వెంట నడవడానికి సిద్దమయ్యారు. తన ప్రధాన ప్రత్యర్ధులు చంద్రబాబు, కిరణ్‌ల కాంబినేషన్‌, సొంత కులంలో వస్తున్న వ్యతిరేకతతో అలెర్ట్ అయిన పెద్దిరెడ్డి సిఎం జగన్ ను అప్పట్లో జైల్లో పెట్టించింది కిరణ్‌కూమార్‌రెడ్డే అని ప్రచారం మొదలుపెట్టారు. రెడ్లు జారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ జైలు సెంటిమెంట్ పండిచాలని చూస్తున్నారంట.. సి ఇక మిధున్ రెడ్డి సైతం ఒకాయన సూట్‌కేస్‌తో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారంటూ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. తనకు బాబు,కిరణ్ ఇద్దరు శతృవులే అని జూన్‌ నాలుగు తర్వాత మళ్లీ అదే సూటుకేసుతో కిరణ్‌ని హైదరాబాద్ పంపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అన్నట్లు తయారైంది చిత్తూరు జిల్లా రాజకీయ సమరం . మూడు వర్గాలు ఈ ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని పనిచేస్తున్నాయి. పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మిత్రపక్షాలు శ్రేణులు అంటుంటే.. సీఎంలుగా ఉన్నప్పుడే ఎమీ చేయాలేకపోయారు. ఇక ఇప్పుడేం చేస్తారని పెద్దరెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు.. మరి చూడాలి ఈ చిరకాల ప్రత్యర్ధుల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News