Aaqib Javed: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ( Pakistan Cricket Team) నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అందరికీ ఆ జట్టును చూస్తేనే.. కంపరమెత్తిపోయినట్లుగా వ్యవహరిస్తారు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఏది చేసినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దాంతో ప్రతి ప్లేయర్ ట్రోలింగ్ కు కూడా గురవుతాడు. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ సెలెక్టర్ గా ఉన్న ఆకిబ్ జావేద్ (Aaqib Javed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup) నేపథ్యంలో పాకిస్తాన్ ఛాంపియన్ అవుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !
కానీ ఆకిబ్ జావేద్ మాత్రం భిన్నంగా స్పందించారు. ర్యాంకింగ్స్ లో 7, 8 స్థానాల్లో ఉన్న పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ గెలవడం ఏ మాత్రం సాధ్యం కాదంటూ బాంబు పేల్చాడు. అట్టడుగున ఉన్న పాకిస్తాన్… వరల్డ్ కప్ కొడుతుందని చాలా మంది అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపణలు కూడా చేశారు. ఏదైనా సాధ్యం అయ్యే విషయాన్ని మాత్రమే చర్చించుకోవాలి తప్ప… పీడ కలలు కనకూడదని తెలిపారు ఆకిబ్ జావేద్.
2027 వన్డే వరల్డ్ కప్ లో ఎలాగైనా గెలవాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా కసిగా ముందుకు సాగుతోంది. అంతేకాదు ఈ వరల్డ్ కప్ లో టీమిండియాను ఓడించి ఇంటికి పంపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెటర్లు చాలా కష్టపడుతున్నారు. పడ్డ చోటే నిలబడాలన్న కసి మాత్రం పాకిస్తాన్ క్రికెటర్లలో కనిపిస్తోంది. అయితే ఇంత కసిగా పోరాటం చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ల ఆశలపై నీళ్లు చల్లారు సెలెక్టర్ ఆకిబ్ జావేద్ (Aaqib Javed). ర్యాంకింగ్స్ లో చిట్ట చివరన ఉన్న పాకిస్తాన్.. వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమన్నారు.
వరల్డ్ కప్ గెలుస్తామని అందరినీ మోసం చేయడం కూడా చాలా తప్పు అంటూ బాంబు పేల్చారు. కానీ గట్టి పోటీని ఇస్తామని చెప్పితే బాగుంటుందని హేళన చేశారు. ఇప్పుడు కాకపోయినా మరో వరల్డ్ కప్ అయినా గెలిచే దిశగా అడుగులు వేయాలని సూచనలు చేశారు. కానీ ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలుస్తుందని తాను చెప్పలేను అంటూ బాంబు పేల్చారు. దీంతో ఆకిబ్ జావేద్ (Aaqib Javed) పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు. నువ్వే నమ్మకపోతే… ప్రత్యర్ధులు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా 2027 వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది అక్టోబర్ మాసంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఐసీసీ ప్లాన్స్ చేస్తోంది. ఈసారి కొత్త ఫార్మాట్ లో.. బలమైన జట్ల మధ్య ఎక్కువ మ్యాచులు ఉండేలా చూస్తోంది ICC.