AP Council Session-2026: ఏపీలో వివిధ సంస్థలకు భూకేటాయింపు వ్యవహారంపై శాసనమండలిలో చర్చ జరిగింది. దీనిపై విపక్ష సభ్యుడు మాధవ్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై మంత్రి లోకేష్ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీలకు భూముల కేటాయింపు వ్యవహారాన్ని గుర్తు చేస్తూ వివరణ ఇచ్చారు.
విశాఖలో కంపెనీలకు భూకేటాయింపులపై మండలిలో చర్చ
ఈ వ్యవహారంపై మంత్రి లోకేష్ వివరణ ఇచ్చారు. సభ్యుడు మాధవ్.. మేధావి అంటూనే అమెరికాలో చదివారని అనుకుంటానని అన్నారు. హైదరాబాద్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కంపెనీలకు భూముల కేటాయింపు వ్యవహారాన్ని గుర్తు చేస్తూ వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో రహేజా మైండ్ స్పేస్ క్రియేట్ చేశారని, ఆనాడు 97 ఎకరాలు కేటాయించారని వివరించారు.
ఈ ఐటీ కంపెనీలో లక్ష మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ క్రియేట్ చేయాలంటే వాటిని కట్టించి అద్దెకు ఇవ్వడం జరుగుతోందన్నారు. హైదరాబాద్ మైండ్ స్పేస్ నిర్మించిన భవనంలో ఫేమస్ కంపెనీలు తమ తమ ఆఫీసులు ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు.
కొన్ని కంపెనీలు సభ్యులకు తెలియక పోవచ్చన్నారు.వాళ్లు జీసీసీ నిర్మించాలని భావిస్తున్నారని, వాళ్లతో తాను మూడుసార్లు జూమ్ మీటింగ్‌లో మాట్లాడానని, బెంగుళూరులోని వారి ఆఫీసుకి వెళ్లి స్వయంగా చూశానని తెలిపారు. ఆ కంపెనీ దేశవ్యాప్తంగా 150 జీసీసీ వారు నిర్మించారని, లక్షా 45 వేల ఉద్యోగులు పని చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ ప్రశ్నలపై ధీటుగా పాలక పక్షం సమాధానాలు
ఏమి చెయ్యాలన్నా కేబినెట్‌లో చర్చంచిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 99 పైసలకు భూములు కేటాయింపు వ్యవహారంపై గతంలో తాను ఛాలెంజ్ చేశానన్నారు. ఆయా కంపెనీలకు తాను ఇచ్చినట్టు నిరూపిస్తే, రాజీనామాకు సిద్ధమని ఆనాడే చెప్పానన్నారు. తాము భూములు ఇచ్చిన కంపెనీలు, క్రెడిబులిటీ, బ్యాక్ గ్రౌండ్ చూసి ఇస్తున్నట్లు చెప్పారు మంత్రి లోకేష్.
ఇదే సమయంలో మాధవ్ జోక్యం చేసుకున్నారు. ప్రజలకు కొన్ని నిజాలు తెలియాలని అన్నారు. వెంటనే మంత్రి జోక్యం చేసుకున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా, ఏఎస్ఎస్ఆర్ కంపెనీలకు భూములు ఇవ్వకూడదా? అంటూ ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానంలో వీళ్లు పిల్ వేశారని, చివరకు కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. ఇదే సమయంలో గూగుల్ డేటా సెంటర్‌ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాధవ్ అన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేసిందంటూ చెప్పడంపై కూటమి నేతలు మండిపడ్డారు.
ఈలోగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ నోరు విప్పారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు 99 పైసలకు ఇచ్చుకోవచ్చంటూ మంత్రి చెప్పారని, దానికి సభ్యుడు ప్రశ్నిస్తున్నారని అన్నారు. వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు.. బొత్సకు కౌంటరిచ్చారు. విపక్ష నేత పెద్దరికం ఉపయోగించాలన్నారు.
రహేజా అనేది రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదని, వాళ్లు భవనాలు నిర్మిస్తారని తెలియజేశారు. అందులోకి చాలా కంపెనీలు వచ్చాయని, దాని ద్వారా యువతకు ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ లో ప్రూవ్ చేశారని, అదే పద్దతిలో విశాఖలో కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఆ విధంగా మాట్లాడడం సరికాదన్నారు.
ALSO READ: శ్రీశైల క్షేత్రంలో శివనామస్మరణ.. మయూర వాహనంలో మల్లికార్జున స్వామి దర్శనం
రహేజా రియల్ ఎస్టేట్ సంస్థ అని, మధురవాడలో 27 ఎకరాలను 99 పైసలకు ఎలా ఇస్తారంటూ మళ్లీ మాధవ్ ప్రశ్న రైజ్ చేశారు. గూగుల్ ఆల్పాబెట్ కంపెనీ ఆఫీసు బెంగుళూరులో స్పేస్‌ని రెంటుకు తీసుకుందని, కర్ణాటక మాదిరిగా మనం ఎందుకు వెళ్లలేకపోతున్నామని అన్నారు. భూముల ఇవ్వకుండానే పక్క రాష్ట్రాలు యువతకు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాయని గుర్తు చేశారు. ఈలోగా మంత్రి లోకేష్ జోక్యం చేసుకున్నారు.
ఐదు కంపెనీలను భూములు ఇచ్చామని, ఆరో కంపెనీ పేరు సభ్యులు ప్రస్తావించారన్నారు. ఆరోపణలు చేసి బయటకు వెళ్లడం కాదని, లేదంటే ప్రకటన విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనాడు కియా మోటార్స్ కు తక్కువ ధరకు భూములు కేటాయించామని, దానివల్ల ఆ ప్రాంతం రూపురేఖలు మారిందన్నారు. ఎకో సిస్టమ్ అంటే అదని, తాము 22 సిటీలను నిర్మిస్తున్నామని వివరించారు. స్కైరూట్‌కి 300 ఎకరాలు ఇచ్చామన్నారు.
టీసీఎస్, కాగ్నిజెంట్‌కు భూములిస్తే తప్పా @ysjagan ? మీ ఎమ్మెల్యేల బాధ ఏంటి ? మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుంటే తట్టుకోలేక పోతున్నారా ? #APLegislativeCouncil#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/KfBBceZcup
— Telugu Desam Party (@JaiTDP) February 12, 2026