Trains Cancelled: ఏపీలో మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే అలర్ట్ అయింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో నడిచే 29 రైళ్లను రద్దు చేసింది. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాల మధ్య నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ల జాబితాను సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేసింది. దక్షిణ మధ్య పరిధిలో 54 రైళ్లను రద్దు చేశారు.
ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు ముందుగా రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రద్దైన రైళ్ల జాబితాలో సోమవారం విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ వెళ్లే గరీబ్‌రథ్, దిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, మెము రైళ్లు ఉన్నాయి.
1. 27.10.2025న విశాఖపట్నం- కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515)
2. 28.10.2025న కిరండూల్- విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్(18516)
3. 28.10.2025న విశాఖపట్నం- కిరండూల్ ప్యాసింజర్(58501)
4. 28.10.2025న కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్(58502)
5. 28.10.2025న విశాఖపట్నం- కోరాపుట్ ప్యాసింజర్(58538)
6. 28.10.2025న కోరాపుట్- విశాఖపట్నం ప్యాసింజర్(58537)
7. 27.10.2025న విశాఖపట్నం- కోరాపుట్ ఎక్స్‌ప్రెస్(18512)
8. 28.10.2025న కోరాపుట్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్(18511)
9. 28.10.2025న రాజమండ్రి- విశాఖపట్నం మెము (67285)
10. 28.10.202 విశాఖపట్నం-రాజమండ్రి మెము(67286)
11. 28.10.2025న విశాఖపట్నం – కాకినాడ ఎక్స్‌ప్రెస్(17268)
12. 28.10.2025న కాకినాడ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17267 )
13. 28.10.2025న తిరుపతి-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్(08584)
14. 28.10.2025న విశాఖపట్నం – గుంటూరు డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22875)
15. 28.10.2025న గుంటూరు-విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22876)
16. 27.10.2025న విశాఖపట్నం – బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్(18526)
17. 28.10.2025న బ్రహ్మాపూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్(18525)
18. 28.10.2025న విశాఖపట్నం-పలాస మెము(67289)
19. 28.10.2025న పలాస- విశాఖపట్నం మెము(67290)
20. 27.10.205న విశాఖపట్నం-విజయనగరం మెము(67287)
21. 28.10.2025న విజయనగరం-విశాఖపట్నం మెము(67288)
22. 28.10.2025న కటక్-గుణుపూర్ మెము(68433)
23. 29.10.2025న గుణుపూర్-కటక్ మెము(68434)
24. 28.10.2025న బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్(58531)
25. 28.10.2025న విశాఖపట్నం – బ్రహ్మపూర్ ప్యాసింజర్(58532)
26. 28.10.2025న విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్(58506)
27. 28.10.2025న గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్(58505)
28. 28.10.2025న మెహబూబ్ నగర్ -విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్(12862) రద్దు
29. 28.10.2025న MGR చెన్నై సెంట్రల్ – విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్(22870)
మొంథా తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల సమాచారం అందించేందుకు దక్షిణ మధ్య, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని స్టేషన్లలో 24×7 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్‌లు, రీఫండ్ కౌంటర్లు పనిచేస్తున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 54 రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ఎక్స్ లో రైళ్ల జాబితా విడుదల చేశారు.
🌀Cyclone "Montha"
⚠️ Train Cancellations@SCRailwayIndia@RailMinIndia#CyclonePreparedness #SCRUpdates #VijayawadaDivision #CycloneMontha #IndianRailways #SafetyFirst #TrainCancellations #PassengerSafety pic.twitter.com/iYa1Ra3y0x— DRM Vijayawada (@drmvijayawada) October 27, 2025