Sachin Chandwani: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న నటుడు సచిన్ చాంద్ వాడే (Sachin Chandwade) ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలా సచిన్ సూసైడ్ చేసుకొని మరణించారని విషయం తెలియడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.
సచిన్ చాంద్ మహారాష్ట్రలోని జల్గావ్ లోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఉరి వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఈయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో అది గమనించిన తన కుటుంబ సభ్యులు వెంటనే తనని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇలా ఈనెల 23వ తేదీ ఉరి వేసుకున్న సచిన్ చాంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 24వ తేదీ మరణించారు. అయితే ఈయన మరణ వార్త తాజాగా బయటకు రావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురి అయింది.
ఇక సచిన్ ఇదివరకు హీరోగా జంతారా సీజన్ 2(Jamtara 2) తో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు ఇక సచిన్ హీరోగా అసుర్వన్ (Asvuran)సినిమా ఇటీవల షూటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇలా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలోనే ఈయన ఆత్మహత్యకు పాల్పడటంతో సచిన్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. మరి సచిన్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయంపై పోలీసులకు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా..
ఇక సచిన్ కేవలం నటుడిగా మాత్రమే కాదు ఆయన ఐటి ఉద్యోగిగా కూడా పనిచేస్తున్నారు. పూణేలోనే ఐటీ పార్క్ లో ఈయన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కొనసాగుతున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో కొనసాగుతున్న సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తనకు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న తరుణంలో ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఈయన మరణం పై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సచిన్ మరణించడానికి కొద్ది రజులు ముందు చివరి సోషల్ మీడియా వేదికగా తన తదుపరి ప్రాజెక్ట్ అసుర్వన్ సినిమాకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. రామచంద్ర మాంగో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్ సోమ పాత్రను పోషిస్తున్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన వెంటనే హీరో మరణించడంతో చిత్ర బృందం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Tamannaah Bhatia : 5 లక్షల కోసం మా కడుపు కొడుతోంది… తమన్నాపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు