E-Paper
Advertisement

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..
Advertisement

Kurnool Bus Accident: హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరిన కావేరీ ట్రావెల్.. బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నెల్లూరుకి చెందిన ఒకే కుటుంబం మృతి చెందారు.

అయితే ఈరోజు(సోమవారం) కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్ కుటుంబ సభ్యుల అంత్యక్రియల్లో.. పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Advertisement

వింజమూరు మండలం గోళ్లవారి పల్లి నుంచి విడయవాడ వెళ్తున్నారు. జలదంకిలో వీరు కారు టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం.. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. మంటల్లో సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపింది.

Advertisement

Also Read: పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు.. కాపాడే ప్రయత్నంలో

రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లడంతో.. మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయని, మంటల్లో బస్సు పూర్తిగా కాలి బూడిదైందని పేర్కొన్నారు. బస్సులోని కొందరు ప్రయాణికులు అతికష్టం మీద తమ ప్రాణాలను కాపాడుకోగా, మరికొందరు బయటకు వచ్చేలోపే మంటలు చుట్టుముట్టడంతో సజీవ దహనం అయ్యారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×