Sandeep Reddy Vanga Rejects Rashmika Movie : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘గర్ల్ ఫ్రెండ్‘ (Girl Friend Movie). నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రష్మిక పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. ఇందులో రాహుల్ రవింద్రన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ రోల్ మొదట సందీప్ రెడ్డి వంగాకు వెళ్లిందట. ఆయన చేయనంటే చేయనని చెప్పడంతో రాహుల్ నటించాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాజాగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న రాహుల్ ఈ విషయం చెప్పాడు. నిజానికి ఈ చిత్రంలో రాహుల్ బదులుగా సందీప్ రెడ్డి వంగ నటించాల్సి ఉందట. ఆయన చెయనని చెప్పడంతో ఈ పాత్ర తానే చేయాల్సి వచ్చిందన్నారు. ఈ సినిమా కీలకమైన పాత్ర కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)ను అడిగాను. కథ విని చేయనని చెప్పాడు. అతిథి పాత్ర అయితే ఒప్పుకునేవారేమో.
కానీ, ఫుల్ లెన్త్ రోల్ అయ్యేసరికి చేయనని చెప్పారు. సందీప్ నో చెప్పడంతో వెన్నెల కిషోర్ని సంప్రదించాను. తను కూడా చేయనని చెప్పాడు. వెన్నెల కిషోర్ కమెడియన్ మాత్రమే కాదు మంచి నటుడు కూడా. తనలోని సీరియస్ యాంగిల్ బయటకు తిద్దామని అనుకున్నా. కానీ, రోల్ చేయనంటే చేయనని చెప్పేశాడు. నన్ను చూడగానే నవ్వేస్తారు. కాబట్టి నేను సీరియస్ కంటెంట్ చెప్పిన ప్రేక్షకులకు అది కామెడీగా వెళ్తుంది. అప్పుడు నువ్వు చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకులు రీచ్ అవ్వకపోవచ్చు. సీరియస్ రోల్ కాస్తా కామెడీ అవుతుంది‘ అన్నాడు. అలా చివరికి నేనే ఈ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
Also Read: Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా, నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!
నిజం చెప్పాలంటే నటన, దర్శకత్వం ఇలా రెండూ చేయడం నా వల్ల కాదు. నేను మల్టీటాస్కర్ని కాదు. ఇప్పటి వరకు నేను దర్శకత్వం వహించింది రెండు సినిమాలు. అందులో నటించలేదు. కానీ ఈసారి తప్పలేదు అని చమత్కిరించాడు. ప్రస్తుతం రాహుల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన అన్నట్టుగా ఈ చిత్రంలో సందీప్ రెడ్డి వంగ చేసుంటే మూవీకి మరింత ప్లస్ అయ్యేదని, ఈ లవ్ స్టోరీకి మరింత ఇంటెన్సిటీ వచ్చేది అని అన్నారు. కాగా రష్మిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రం అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్గా నటించింది. ఇందులో రక్షిత్ శెట్టి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించనుంది.