BigTV English

Volunteers Resign: ఏపీలో వాలంటీర్లు రాజీనామాలు.. ఇక నేరుగా వైసీపీ తరఫున ప్రచారం..

Volunteers Resign: ఏపీలో వాలంటీర్లు రాజీనామాలు.. ఇక నేరుగా వైసీపీ తరఫున ప్రచారం..
AP Volunteers Resign news
Volunteers

AP Volunteers Resign News(Local news andhra Pradesh): ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు హాట్ టాపిక్ మారాయి. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను కేంద్ర ఎన్నికల సంఘం దూరంగా పెట్టింది. ఆ విధులను సచివాలయ సిబ్బందికి అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. తమ రిజైన్ లెటర్లను అధికారులకు అందిస్తున్నారు.


మచిలీపట్నంలో 1200లకుపైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. భీమవరం 39వ వార్డులో మొత్తం 22 మంది వాలంటీర్ల రిజైన్‌ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 340 మంది వాలంటీర్లు,
రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా 40 మంది వాలంటీర్లు రాజీనామాలు సమర్పించారు.

తమను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచడంపై వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీమానా చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున నేరుగా ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం జగన్ కోసం కష్టపడతామని రిజైన్ చేసిన వాలంటీర్లు చెబుతున్నారు.


Also Read: పింఛన్లపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ .. సచివాలయాల్లో పంపిణీ..

వాలంటీర్ల వైసీపీ నేతల కార్యక్రమాల్లో పాల్గొనడంపై వివాదం రేగింది. ఈ అంశం కోర్టుకు వెళ్లింది. రాజకీయ కార్యక్రమాలకు వాలంటీర్లు దూరంగా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినా సరే వాలంటీర్లు తమ తీరు మార్చుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు సంక్షేమ పథకాల నగదు పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉంచాలని సీఈసీ ఆదేశించింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వాలంటీర్లను ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఈ బాధ్యతను సచివాలయాల సిబ్బందికి అప్పజెప్పింది. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫింఛన్ల పంపిణీ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు రాజీనామాలు చేసి నేరుగా వైసీపీ నేతల వెంట తిరిగేందుకు సిద్ధమవుతున్నారు.

Related News

Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

Anantapur News: థియేటర్లలో ఓజీ ఫిల్మ్.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వరుస ట్వీట్లు, షాకైన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

AP DSC: DSC విషయంలో జగన్ ఓటమి, లోకేష్ గెలుపు అదే

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Big Stories

×