E-Paper
Advertisement

AP MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ నాయకులే.. దాదాపుగా టీడీపీ హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్..!

AP MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ నాయకులే.. దాదాపుగా టీడీపీ హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్..!
Advertisement

Update on AP MLC Candidates List: శాసనమండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలకు అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులుగా ఎన్‌వీ‌ఎస్ఎన్ వర్మ, మరొకటి మహమ్మద్ ఇక్బాల్ దాదాపుగా ఓకే అయినట్టు సమాచారం. త్వరలో అభ్యర్థుల పేర్లను టీడీపీ ప్రకటించనుంది.

పిఠాపురంలో పవన్‌కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు మాజీ ఎమ్మెల్యే వర్మ. అంతేకాదు భారీ మెజారిటీతో జనసేన అధినేతను గెలిపించారాయన. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట ఇచ్చారు. దీంతో వర్మకు సీటు ఖాయమైంది. మరొకటి హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

ఎమ్మెల్యే కోటా కావడంతో ఈ రెండు స్థానాలను టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీనికి సంబంధించి బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ రెండు వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. మూడున పరిశీలన.. ఐదున ఉప సంహరణకు అవకాశం ఉందని ఈసీ తెలిపింది. ఒకవేళ వైసీపీ గనుక రేసులో ఉంటే జూలై 12న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

Also Read: జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గు చేటు: ఎమ్మెల్యే మాధవి

Advertisement

ఒకవేళ వైసీపీ నుంచి ఎవరూ రేసులో లేకుంటే ఏపీ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా అయ్యే ఛాన్స్ ఉంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా మహ్మద్ ఇక్బాల్, సి. రామచంద్రయ్య ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిద్దరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేశారు. రామచంద్రయ్యపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో రెండు స్థానాలు ఖాళీకావడంతో ఉప ఎన్నికలు అనివార్యమైంది.

Tags

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×