BigTV English

Nidigunta Aruna: ఇంతకీ అరుణ ఏ పార్టీ? తేలు కుట్టిన దొంగల్లా నేతలు

Nidigunta Aruna: ఇంతకీ అరుణ ఏ పార్టీ? తేలు కుట్టిన దొంగల్లా నేతలు

వైసీపీలో వైభోగం అనుభవించింది, కూటమి వచ్చాక పాత పరిచయాలతో రెచ్చిపోయింది. చివరకు జైలుకెళ్లింది. సింపుల్ గా ఇదీ అరుణ స్టోరీ. ఆమె జైలుకెళ్లడంపై రెండు పార్టీల నేతలు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఆమె వైసీపీ అంటే కాదు, టీడీపీ అంటున్నారు. మీ పార్టీ ఆమెను పెంచి పోషించిందంటే, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఆటలు సాగాయంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఆమెకు సహకరించిన నేతలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు. నిడిగుండ అరుణ సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే మాత్రం ఆమె ఏ పార్టీనో, ఏ పార్టీకి మద్దతిస్తారో, ఏయే అధికారులతో ఫొటోలు దిగారనేది స్పష్టంగా తెలిసిపోతుంది.


వైసీపీ హయాంలో వైభోగం..
నిడిగుండ అరుణ అలియాశ్ దిశ అరుణ.. వైసీపీ హయాంలో ఆమె తనను తాను దిశ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధ్యక్షురాలిగా చెప్పుకునేది. అందుకే ఆమె దిశ అరుణ అయ్యారు. దిశ అరుణగా రాజకీయ నాయకులతో కలసి మెలసి తిరిగేది, వారి బర్త్ డే వేడుకలకు హాజరై కేక్ తినిపించేది. ఆ వీడియోలు, ఫొటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ ఆఫీస్ లో ఆమె పెట్టిన ప్రెస్ మీట్ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. వైసీపీ పార్టీ నేతగా అరుణ ప్రచారం చేసుకున్నారని, ఆ పార్టీ నేతలు కూడా ఆమెకు సహకరించారని టీడీపీ వెటకారం చేస్తోంది. అయితే ఇక్కడ వైసీపీకి తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఫొటోలు, వీడియోలు, అన్నీ పగడ్బందీగా ఉండటంతో సోషల్ మీడియా దెబ్బకి వైసీపీ తేలు కుట్టిన దొంగలా మారింది.

టీడీపీ సంగతేంటి..?
వైసీపీ హయాంలో ఆమె తప్పులు చేసింది సరే, మరి కూటమి వచ్చాక అయినా ఆ తప్పులకు లెక్కలు చెప్పాలి కదా. కానీ ఇప్పుడు కూడా అదే జరిగింది. వాస్తవానికి అరుణ ప్రియుడు శ్రీకాంత్ పెరోల్ పై విడుదల కావడం మరింత సంచలనంగా మారింది. మీడియా హడావిడి వల్ల అసలు విషయం బయటకు పొక్కడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు తీసుకుంది. శ్రీకాంత్ పెరోల్ రద్దయింది, బెదిరింపుల కేసులో అరుణ అరెస్టై జైలుకెళ్లింది. అయితే ఈ పెరోల్ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు కృషి చేశారనే ఆరోపణలు పార్టీని ఇబ్బంది పెట్టాయి. తనకే సంబంధం లేదని, తన నియోజకవర్గానికి చెందిన వారు వస్తే పెరోల్ కోసం సిఫారసు చేశానని, అయినా తన లేఖ వల్ల పెరోల్ రాలేదంటూ గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. మరికొందరు నేతల పేర్లు వినపడుతున్నా వారు బయటకు రావడానికి జంకుతున్నారు.


అంతా ఆ ఫోన్లలోనే..
అరెస్ట్ సమయంలో నిడిగుండ అరుణ నుంచి పోలీసులు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలో అసలు వ్యవహారం అంతా ఉందని తెలుస్తోంది. పోలీస్ అధికారుల వ్యవహారాలు కూడా అందులో ఉన్నాయట. అదే సమయంలో రాజకీయ నాయకులతో ఆమె దిగిన ఫొటోలు, ఆడియో కాల్స్ రికార్డింగ్ లు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతున్నా.. అందులోనీ సమాచారం అంతా బయటకు వస్తుందని ఆశించలేం. ఈ విషయంలో తలాపాపం తిలా పిడికెడు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఆమె బాధితులు అన్ని పార్టీల్లోనూ, చివరకు ప్రభుత్వ విభాగాల్లో కూడా ఉండటం విశేషం. సో అందరూ దొంగలే కాబట్టి, అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మినహా ఇంకో అడుగు ముందుకు వేయడం లేదు.

Related News

Vijayawada Loan Scam: బెజవాడలో కిలాడీ లేడీ.. లోన్లు ఇప్పిస్తానని రెండువేల మందికి టోకరా

Bhavani Rapido Success: భర్త అనారోగ్యం.. రాపిడో బైక్‌తో అండగా భవానీ.. ట్వీట్ చేసిన టిడిపి!

AP Govt decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాలపై బిగ్ ప్లాన్.. అదేమిటంటే?

India pension plan: 60 ఏళ్ల తర్వాత కూడా టెన్షన్ ఫ్రీ.. ఈ సూపర్ స్కీమ్ మీకు తెలుసా!

CM Chandrababu: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Big Stories

×