Tollywood Films: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇలా షూటింగ్ ఆగిపోవడం వలన ప్రస్తుతం షూటింగ్ చేయవలసిన సినిమాలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు ఒక సినిమాకి సంబంధించి సెట్ వేసిన తర్వాత అనుకున్న టైంలో అక్కడ షూటింగ్ జరగకపోతే ఆ ప్లేస్ రెంట్, అలానే వాతావరణ పరిస్థితుల వలన సెట్ నాశనం అయ్యే అవకాశం. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి.
అందుకనే చాలామంది అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చేయడానికి త్వరపడతారు. ప్రస్తుతం తెలుగు సినిమా కార్మికులు 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఒక వైపు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. అయితే ఇది ఇప్పట్లో కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ కొలిక్కి వచ్చినట్లయితే సెట్ మీదకి వెళ్లడానికి కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి.
సెట్స్ పైకి వెళ్ళే సినిమాలు
సినిమా కార్మికులు సమ్మె విరమించిన వెంటనే కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 157 వ సంక్రాంతి కానుకగా అనౌన్స్ చేశారు. సమ్మె విరమిస్తే మొదటి పట్టాలెక్కనున్న సినిమా ఇదే.
మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో సెప్టెంబర్ 25న ఈ సినిమా వస్తుంది అని అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమా కూడా త్వరగా షూటింగ్ కి వెళ్ళాలి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా కూడా త్వరగా షూటింగ్ కి వెళ్ళాలి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ విషయంలో పోస్ట్ పోన్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట ఈ సినిమాను మార్చ్ 2026 లో రిలీజ్ చేస్తారు అని అనౌన్స్ చేశారు. కానీ ఆ డేట్ కి ఇప్పుడు ఈ సినిమా వచ్చేటట్లు లేదు.
ప్రభాస్ వి ఏకంగా రెండు సినిమాలు ఆగిపోయాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ. అలానే మారుతీ దర్శకత్వంలో రానున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న పారడైజ్ సినిమా కూడా ఆగిపోయింది. ఈ సినిమాను కూడా 2026 మార్చ్ నెలలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ 75వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సమ్మె విరమించిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. కేవలం ఈ సినిమాలు మాత్రమే కాకుండా దాదాపు అరడజన సినిమాలకు పైగా షూటింగ్ చేయవలసిన సినిమాలు ఉన్నాయి.
Also Read: Keerthy Suresh: Ai తెచ్చిన తంటా, ఏకంగా మహానటికే బట్టలు లేకుండా చేశారు