Big Stories

Attack on CM Jagan : సీఎం జగన్ పై దాడికేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నిందితుడు?

Progress in Attack on CM Jagan Case(Andhra politics news) : సీఎం జగన్ పై దాడికేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్థానికులు తమ మొబైల్స్ లో తీసిన వీడియోల ఆధారంగా పోలీసులు ఐదుగురు అనుమానితులను గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఒకరు నిందితుడని భావిస్తున్నారు. ఐదుగురు యువకులను దాడి చేయడానికి గల కారణాలపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. టైల్స్ రాయి ముక్కతో జగన్ పై దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు నిందితుడిగా భావిస్తున్న యువకుడు.. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్ గా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఆకాష్, దుర్గారావు, చిన్ని, సంతోష్ లు ఉన్నారు.

- Advertisement -

Also Read : Police Reward : రాయి దాడి కేసు.. నిందితులను పట్టిస్తే రూ.2 లక్షలు.. కానీ ?

- Advertisement -

శనివారం (ఏప్రిల్ 13) రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్ నగర్ లో సీఎం జగన్ ప్రచారానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ కరెంట్ పోవడం, గుర్తుతెలియని వ్యక్తులు రాయి విసరడం, జగన్ ఎడమ కంటి పైభాగాన, ఎమ్మెల్యే వెల్లంపల్లికి కంటికి గాయాలవ్వడం అంతా.. రెప్పపాటుకాలంలో జరిగిపోయాయి. ఆ వెంటనే ఇద్దరికీ వైద్యులు చికిత్స చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు జగన్ కు చికిత్స చేసి గాయమైన చోట మూడు కుట్లు వేశారు. ఆ తర్వాతి రోజు.. ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్.. నిన్నటి నుంచి మళ్లీ ప్రచారం షురూ చేశారు.

కాగా.. సీఎం ప్రచారం జరుగుతుంటే కరెంట్ ఎలా పోతుంది? ఇదంతా అధికార పార్టీ కుట్రేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే.. అదంతా సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగంగా జరిగిందని సీపీ కాంతిరాణా తెలిపారు. ప్రచార రూట్ లో విద్యుత్ కనెక్షన్ లైన్లు, కేబుల్ లైన్లు ఎక్కువగా ఉండటంతో.. అవి రూఫ్ టాప్ కు తగిలే అవకాశం ఉంది. సీఎం భద్రత కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారాయన.

- Advertisement -
SourceBureau

ఇవి కూడా చదవండి

Latest News