Big Stories

Police Reward : రాయి దాడి కేసు.. నిందితులను పట్టిస్తే రూ.2 లక్షలు.. కానీ ?

Police Reward on Stone Attack Accuse : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏప్రిల్ 14న గుర్తుతెలియని వ్యక్తులు రాయిదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా నలుగురు అనుమానితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ నలుగురిలో ఒకరు నిందితుడై ఉంటాడని భావిస్తున్నారు. కాగా.. నిందితుడు ఎవరన్నది ఎవరైనా పట్టిస్తే.. వారికి రూ.2 లక్షలు ఇస్తామని రివార్డు ప్రకటించారు. ఇలాగైనా కేసు త్వరగా ఓ కొలిక్కి వస్తుందని రివార్డు ప్రకటించినట్లు తెలిపారు. నిందితుడు ఎవరో సమాచారం ఇచ్చాక.. అతను దొరికితేనే బహుమతి ఇస్తామని షరతు విధించారు.

- Advertisement -

Also Read : చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తల పెట్టడమే: జగన్

- Advertisement -

ఈ కేసులో ఇప్పటికే 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు విచారించారు. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశం నుంచే దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అలాగే ఆ ప్రాంతంలో అనుమానిత వ్యక్తుల ఫోన్ల ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఇది రాయిదాడేనా ? లేక క్యాట్ బాలా? ఎయిర్ గన్నా? అన్నదానిపై స్పష్టత లేదు. ఈ కేసును డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యక్షసాక్షుల నుంచి స్టేట్ మెంట్లను రికార్డు చేయిస్తోంది సిట్.

దీనిపై వైసీపీ నేతలో ఒక్కోవిధంగా స్పందించడం గమనార్హం. ప్రభుత్వ సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి ఎయిర్ గన్ లేదా క్యాట్ బాల్ తో దాడి చేసి ఉండొచ్చని చెప్పగా.. మరికొందరు నేతలు ఎయిర్ గన్ తోనే దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో పోలీసులు ఏకీభవించడం లేదు. నిందితుడు దొరికితేనే అసలు దాడి దేనితో చేశాడన్న దానిపై స్పష్టత వస్తుందంటున్నారు. వీడియో ఎవిడెన్సుల ఆధారంగా రాయితోనే దాడి జరిగినట్లు తెలుస్తోందన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News