Big Stories

Mahanadu : పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది.. మహానాడులో బాలయ్య, లోకేశ్ గర్జన..

Mahanadu : రాజమండ్రిలో టీడీపీ మహానాడు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కానీ ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో భారీగా వర్షం కురిసింది. వాన కురుస్తున్నా తడుస్తూనే నేతలు ప్రసంగాలు కొనసాగించారు. అటు కార్యకర్తలు కూడా వర్షంలో తడుస్తూనే ప్రసంగాలు విన్నారు.

- Advertisement -

కడియం మండలం వేమగిరిలో టీడీపీ మహానాడు సభా ప్రాంగణం వద్ద వర్ష బీభత్సానికి కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు. మహానాడు సభా ప్రాంగణం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. భారీ ఈదురు గాలులకు కటౌట్ ఒక్కసారిగా వీఐపీ టెంట్‌పై పడింది. అప్పటి వరకు అదే టెంట్‌లో నారా లోకేశ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, అశోక్‌ గజపతిరాజు, పంచుమర్తి అనురాధ, బాలవీరాంజనేయులు ఉన్నారు. వారంతా బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఎన్టీఆర్‌ కటౌట్‌ పడి వీఐపీ టెంట్‌ నేలకొరిగింది. వర్షంలోనే నేతల ప్రసంగాలు కొనసాగించారు. తడవకుండా కార్యకర్తలు తలపై కుర్చీలు అడ్డుపెట్టుకున్నారు. చంద్రబాబు సభా ప్రాంగణానికి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కొంత ఆలస్యంగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

- Advertisement -

టీడీపీ అంటే ఘన చరిత్ర ఉన్న పార్టీ .. వైసీపీ అంటే గలీజు పార్టీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల విలువైన చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్‌ బాటిల్‌ తాగేవాడు పేదవాడా? అని సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. సైకో జగన్‌ చిన్నప్పుడు చాక్లెట్‌ దొంగ.. పెద్దయ్యాక బడా చోర్‌గా మారారని ఆరోపించారు.

జగన్‌ పాలనలో యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ బాధితులేనని లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర అడ్డుకోవడానికి జగన్‌ రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగిస్తే.. తాను అంబేడ్కర్‌ రాజ్యాంగంతో సమాధానం చెప్పానని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలి పెట్టనన్నారు.
అమలాపురంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి జైలులో పెడతానని హెచ్చరించారు.

పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉందని లోకేశ్‌ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నదే తన‌ సింగిల్‌ పాయింట్‌ ఎజెండా అని అన్నారు.

టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేస్తే ప్రస్తుతం గంజాయిసాగులో ఫస్ట్ లో ఉందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దౌర్జన్యంతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఇలా మామాఅల్లుళ్ల తమ స్పీచ్ తో టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News