BigTV English

Gannavaram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. వల్లభనేని వంశీ VS యార్లగడ్డ వెంకట్రావు.. గన్న”వరం” ఎవరికి ?

Gannavaram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. వల్లభనేని వంశీ VS యార్లగడ్డ వెంకట్రావు.. గన్న”వరం” ఎవరికి ?

Gannavaram Assembly Constituency : ఆంధ్రా రాజకీయాల్లో ప్రత్యేక స్థానాలున్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఇక్కడ రాజకీయ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గన్నవరంకు భౌగోళికంగా కీలక స్థానం ఉంది. అటు ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు సరిహద్దుగా ఉంది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గన్నవరం పరిధిలోనే ఉంది. ఇక్కడ గత రెండు టర్మ్ లలో వల్లభనేని వంశీ గెలుస్తూ వచ్చారు. కానీ 2019లో మాత్రం టీడీపీ నుంచి గెలిచినా వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి కూడా ఇద్దరు టిక్కెట్లు ఆశిస్తున్నారు. అందులో ఒకరు యార్లగడ్డ వెంకట్రావు, దాసరి బాల వర్ధన్ రావు ఉన్నారు. ఇందులో బాలవర్ధన్ రావు టీడీపీలో చాలా సీనియర్. ఎప్పటిలాగే ఈసారి కూడా గన్నవరం నియోజకవర్గం ద్విముఖ పోరుకు రెడీ అయింది. మరి ఇక్కడి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

వల్లభనేని వంశీ (గెలుపు) VS యార్లగడ్డ వెంకట్రావు


2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డ వల్లభనేని వంశీ 47 శాతం ఓట్లు రాబట్టారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు 46 శాతంతో గట్టి పోటీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే వంశీ వైసీపీ వైపు వచ్చారు. వెంకట్రావు టీడీపీ టిక్కెట్ రేసులో ఉన్నారు. మరి ఈసారి ఎన్నికల్లో గన్నవరం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

వల్లభనేని వంశీ (YCP) ప్లస్ పాయింట్స్

ప్రజలకు అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం

గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉండడం

వల్లభనేని వంశీ మైనస్ పాయింట్స్

గన్నవరం సెగ్మెంట్లో గుంతల రోడ్లతో జనం అవస్తలు

టీడీపీ రెబల్ గా మారడంతో పెరిగిన నెగెటివిటీ

యాంటీ ఇంక్యుబెన్సీ ఎఫెక్ట్

యార్లగడ్డ వెంకట్రావు (TDP) ప్లస్ పాయింట్స్

టీడీపీ అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్

పబ్లిక్ లో మరింత పెరిగిన పర్సనల్ ఇమేజ్

వల్లభనేని వంశీకి టఫ్ ఫైట్ ఇస్తారన్న అభిప్రాయం

యార్లగడ్డ వెంకట్రావు మైనస్ పాయింట్స్

క్యాడర్ ను ఎంత వరకు కలుపుకొని వెళ్తారన్న డౌట్లు

Caste Politics

గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ సామాజికవర్గం 23 శాతంతో బలంగా ఉంది. ఇందులో టీడీపీకి 40 శాతం, వైసీపీకి 55 శాతం, ఇతరులకు 5 శాతం సపోర్ట్ ఇస్తామంటున్నారు. 16 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గంలో టీడీపీకి 60 శాతం, వైసీపీకి 30 శాతం, ఇతరులకు 10 శాతం మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. 12 శాతం ఉన్న యాదవ కమ్యూనిటీలో టీడీపీకి 40 శాతం, వైసీపీకి 55 శాతం, ఇతరులకు 5 శాతం మద్దతు ఇస్తామంటున్నారు. గౌడ్స్ లో టీడీపీ, వైసీపీకి చెరో 50 శాతం చొప్పున సపోర్ట్ ఇస్తామని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాపుల్లో టీడీపీకి 60 శాతం, వైసీపీకి 35 శాతం, ఇతరులకు 5 శాతం సపోర్ట్ గా ఉంటామంటున్నారు. అటు ముస్లింలలో టీడీపీకి 35 శాతం మద్దతుగా ఉంటామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 60 శాతం, ఇతరులకు 5 శాతం మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో అభిప్రాయం వెల్లడించారు. ఇక వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

వల్లభనేని వంశీ VS యార్లగడ్డ వెంకట్రావు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గన్నవరంలో టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ 46 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

.

.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×