Rashmika: రష్మిక మందన్న భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక (Rashmika)ప్రస్తుతం మరో నాలుగు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక రష్మిక సినిమాలలో నటిస్తుంది అంటేనే ఆ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈమె స్పెషల్ సాంగ్స్ గురించి అలాగే డార్క్ రోల్స్ గురించి కూడా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో కథ డిమాండ్ చేస్తే చాలామంది సెలబ్రిటీలు డార్క్ రోల్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ (Special Songs) కూడా చేస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే రష్మిక వీటిపై స్పందిస్తూ… ఇండస్ట్రీలో నాకెంతో ఇష్టమైన నలుగురు డైరెక్టర్లు ఉన్నారని వారి సినిమాలలో తాను స్పెషల్ సాంగ్స్ చేయమన్న చేస్తాను అలాగే డార్క్ రోల్స్(Dark Roles) చేయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు.
ఇలా ఆ నలుగురు డైరెక్టర్ల సినిమా కోసం తాను ఏం చేయడానికి అయినా సిద్ధమేనని రష్మిక తెలిపారు. అయితే ఆ డైరెక్టర్లు ఎవరు అనేది మాత్రం ఈమె వెల్లడించలేదు. దీంతో రష్మిక చెప్పిన ఆ నలుగురు డైరెక్టర్లు ఎవరా? అనే విషయంపై అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు అయితే ఇందులో సుకుమార్ ,సందీప్ రెడ్డి కచ్చితంగా ఉంటారని ఆ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్, సందీప్ రెడ్డి దర్శకత్వంలో రష్మిక నటించి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన నలుగురు ఫేవరెట్ డైరెక్టర్ల జాబితాలో వీరిద్దరు ఉంటారని కూడా అభిమానులు భావిస్తున్నారు.
విజయ్ దేవరకొండతో ఏడడుగులు..
మరి ఇండస్ట్రీలో రష్మికకు ఇష్టమైన నలుగురు డైరెక్టర్లు ఎవరు అనేది తెలియాల్సి ఉంది . ఇక రష్మిక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుత ఈమె మైసా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ అట్లి కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. అలాగే కాంచన 4 సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రష్మిక దయ్యం పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వ్యక్తిగత జీవితంలో కూడా బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఈమె నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి పనులలో కూడా బిజీ బిజీగా ఉన్నారు.