Squats Benefits: చిన్నప్పుడు స్కూలులో.. తెలుగు పద్యం చెప్పకపోయినా, లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చినా ఉపాధ్యాయులు మనతో గుంజీలు తీపించేవారు. ఈ జ్ఞాపకాలు అందరికీ గుర్తుండి ఉంటాయి. అలానే పెద్దయ్యాక కూడా రోజూ 30 గుంజీలు తీయనమని సలహా ఇస్తున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఇది శరీరానికి పూర్తి స్థాయి వ్యాయామంగా పరిగణిస్తారు. గుంజీలు అంటే.. కేవలం చేతులకు మాత్రమే కాదు, మొత్తం శరీరానికి ఉపయోగపడే వ్యాయామం. గుంజీలతో మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతిరోజూ మీ వ్యాయామంలో భాగంగా.. 30 తీయడం వల్ల మంచి శరీరాకృతి లభిస్తుంది. కొన్ని వారాల్లోనే మీ శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. గుంజీలు తీయడం వల్ల పొత్తికడుపు కండరాలకు బలం చూకూరుతుంది. వెన్నునొప్పి ఉన్నవాళ్లకి కూడా గుంజీలు అత్యంత ఉపయోగకరం. ఇవి వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలను బలపరచి వెన్నునొప్పి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. .
రోజూ గుంజీలు తీస్తే.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి, రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు రావు. ఈ వ్యాయామం గుండెపై ఒత్తిడి తగ్గించడంలోనూ బాగా సహాయపడుతుంది. వయసు మెరుగుతున్నా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది సహజ మార్గం.
గుంజీలతో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని పేగు కండరాలు బలపడటంతో పాటు మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. శరీరంలోని అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన కదలికలు గుంజీల ద్వారా లభిస్తాయంటున్నారు నిపుణులు.
అధిక బరువు తగ్గాలనుకునేవారికి.. గుంజీలు బెస్ట్ వర్కౌట్. ప్రతిరోజూ 30 గుంజీలు తీయడం వల్ల మెటబాలిజం వేగం పెరుగుతుంది. దీంతో బాడీలోని కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. తొడలు, పిరుదుల వద్ద పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవడంతో శరీరాకృతి అందంగా మారుతుంది. బరువు తగ్గడం కేవలం అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం కూడా చాలా ముఖ్యం.