New Aadhaar App: ఆధార్ సమస్యలకు చెక్ పడినట్టేనా? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI రిలీజ్ చేసిన యాప్ కి చెందిన విషయాలేంటి? ఇకపై ఆధార్‌కి చెందిన కార్యకలాపాలను స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చా? చివరకు క్యూ ఆర్ కోడ్ సైతం షేర్ చేయవచ్చా? అవుననే అంటున్నారు. ఇంతకీ ఆ యాప్ విషయాలపై ఓ లుక్కేద్దాం.
కొత్త ఆధార్ యాప్.. డౌన్‌లోడ్ ఎలా?
ఆధార్ పేరు చెప్పగానే చాలామంది ఇబ్బంది పడతారు. ఎక్కడకు వెళ్లినా కచ్చితంగా వినియోగదారులు ఆధార్ కార్డును తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒకవేళ మరిచిపోతే చేయాల్సి పని ఆగిపోయినట్టే. ఇదంతా ఒకప్పటి విషయం. ఇప్పుడు ఆ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. తాజాగా కొత్త ఆధార్ యాప్‌ను విడుదల చేసింది ఆ సంస్థ. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఇకపై ఆ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో వచ్చింది. యాప్ ద్వారా ఇకపై ఆధార్ కార్డుకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ ద్వారానే ఈ ప్రక్రియ మొత్తం కొనసాగించవచ్చు. కార్డును భద్ర పర్చుకోవచ్చు కూడా. ఆధార్ కార్డు షేర్ చేయడం, ఫేస్ స్కాన్ ధృవీకరించడం వంటి ప్రక్రియలు సులభతరం అయ్యాయి.
బయోమెట్రిక్ డేటాను లాక్ చేయవచ్చు
ఇప్పటివరకు లేని ఫీచర్లు, సెటప్ అందుబాటులోకి వచ్చేశాయి. యాప్ ద్వారా ఆధార్ కార్డును డిజిటల్‌గా క్యూఆర్ కోడ్ ద్వారా షేర్ చేయవచ్చు. వ్యక్తిగతం లేకుంటే అధికారికంగా ఆధార్ వివరాలను ఇతరులకు తెలియజేయాల్సి వచ్చినప్పుడు ఏ సమాచారాన్ని ఇవ్వాలి? ఎంత వరకు షేర్ చేయాలి? అనేది ఇకపై యూజర్ నిర్ణయం తీసుకోవచ్చు. మిగతా వివరాలను ప్రైవేట్‌గా ఉంచుకునే సౌలభ్యం కూడా అందులో ఉంది.
బయో మెట్రిక్ డేటాను లాక్, అన్‌లాక్ ఆప్షన్ కొత్త యాప్‌లో పొందుపరిచారు. యూజర్లు తమ ఆధార్ ఎక్కడెక్కడ, ఎప్పుడు వినియోగించాలో సింపుల్ గా ఒక్కక్లిక్‌తో తెలుసుకోవచ్చు. ఆ తరహా వెసులుబాటు ఉంది. ఎవరికైనా ఆధార్ వివరాలు షేర్ చేశామా? మరెవరైనా ఇచ్చామా? అనేది చూసుకోవచ్చు. దీనికితోడు కుటుంబ సభ్యుల ఐదుగురి ఆధార్ కార్డుల వివరాలు ఒకే చోట భద్రంగా ఉంచడానికి కొత్త యాప్ వీలు కల్పిస్తుంది.
ALSO READ: బెంగుళూరు సెంట్రల్ జైలు.. ఖైదీల పార్టీ ఓ రేంజ్‌లో
కొత్త యాప్ డౌన్ లోడ్ చేయాలంటే తొలుత ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కు వెళ్లాలి. ఆధార్ అని టైప్ చేయడం ద్వారా యాప్ కనిపించడంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ తర్వాత, సెక్యూరిటీ కోసం అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చే షరతులను ఓకే చెయ్యాలి. అప్పుడు ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్ ఇవ్వాలి.
Experience a smarter way to carry your digital identity!
The new Aadhaar App offers enhanced security, easy access, and a completely paperless experience — anytime, anywhere.Download now!
Android: https://t.co/f6QEuG8cs0
iOS: https://t.co/RUuBvLwvsQ#Aadhaar #UIDAI… pic.twitter.com/gOwI6jH6Lu— Aadhaar (@UIDAI) November 9, 2025