BigTV English

Allagadda Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఆళ్లగడ్డ ఎవరి అడ్డా..?

Allagadda Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఆళ్లగడ్డ ఎవరి అడ్డా..?

Allagadda Assembly Constituency : ఆంధ్రప్రదేశ్ లో అందులోనూ రాయలసీమలో ఆళ్లగడ్డ రాజకీయం రూటే సపరేటు. ఇక్కడ గంగుల వర్సెస్ భూమా కుటుంబాల మధ్యే రాజకీయ ఆధిపత్య పోరాటం కనిపిస్తుంటుంది. 1970ల నుంచి ఈ రెండు ఫ్యామిలీలే ఆళ్లగడ్డ రాజకీయాలను శాసిస్తున్నాయి. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న భూమా శోభా నాగిరెడ్డి ఎన్నికలు రెండు వారాల్లో ఉన్నాయనగా చనిపోయారు. అప్పటికే ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో పోల్స్ నిర్వహించారు. ఆ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ విజయం సాధిచారు. శిల్పకళకు ఈ నియోజకవర్గం పెట్టింది పేరు. ఇదే సెగ్మెంట్లో ప్రాచీన చారిత్రక ఆలయం అహోబిలం ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఇప్పటిదాకా ఇండిపెండెంట్లు సహా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలను సమానంగా ఆదరించారు. మరి ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో ఆళ్లగడ్డలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

గంగుల బ్రిజేంద్ర రెడ్డి VS భూమా అఖిలప్రియ


2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేశారు. ఇందులో వైసీపీ నుచి నిలబడ్డ బ్రిజేంద్ర రెడ్డి 57 శాతం ఓట్లు రాబట్టారు. టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ 38 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసిన గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకే 2019లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచిన బ్రిజేంద్ర రెడ్డి. గత ఎన్నికల్లో దాదాపు 20 శాతం ఓట్లతో సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు గంగుల బ్రిజేంద్ర. అఖిల ప్రియ టీడీపీలోకి వెళ్లడం, అలాగే వైసీపీ రాష్ట్రవ్యాప్త హవా బ్రిజేంద్ర రెడ్డి విజయానికి కారణమైంది. మరి ఈసారి ఎన్నికల్లో ఆళ్లగడ్డ సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

గంగుల బ్రిజేంద్ర రెడ్డి(YCP) ప్లస్ పాయింట్స్

గంగుల ఫ్యామిలీ 2017లో వైసీపీలో చేరడంతో మారిన సీన్

కుటుంబ బలగం నుంచి గట్టి మద్దతు

కమిట్ మెంట్ ఉన్న లీడర్ గా జనంలో గుర్తింపు

గ్రౌండ్ లెవెల్ లో యాక్టివ్ గా ఉన్న బ్రిజేంద్ర రెడ్డి

గంగుల బ్రిజేంద్ర రెడ్డి మైనస్ పాయింట్స్

దారుణ స్థితికి చేరుకున్న ఆళ్లగడ్డ నియోజకవర్గ రోడ్లు

మూడు మండలాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి

ఆళ్లగడ్డలో ఉద్యోగావకాశాల కొరత

ఆళ్లగడ్డలో భూముల విలువ తగ్గిపోవడం

విద్యార్థినులకు ప్రత్యేకంగా జూనియర్ కాలేజ్ లేకపోవడం

భూమా అఖిలప్రియ (TDP) ప్లస్ పాయింట్స్

తల్లిదండ్రుల రాజకీయ వారసత్వం

గత రెండేళ్లుగా సెగ్మెంట్లో యాక్టివిటీస్

నియోజకవర్గంలో ఇమేజ్ పెంచుకోవడం

టీడీపీ కార్యక్రమాలను జోరుగా నిర్వహించడం

భూమా అఖిలప్రియ మైనస్ పాయింట్స్

వైసీపీ అభ్యర్థిని ఏ మేరకు ఢీకొంటారన్న డౌట్లు

భూమా కిషోర్ రెడ్డి (BJP) ప్లస్ పాయింట్స్

స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్
పబ్లిక్ లో పాజిటివ్ ఇమేజ్ పెంచుకోవడం

భూమా కిషోర్ రెడ్డి మైనస్ పాయింట్స్

తరచూ పార్టీలు మారడం

Caste Politics

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు 22 శాతం మంది ఉన్నారు. ఇందులో 50 శాతం మంది వైసీపీకి సపోర్ట్ గా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అలాగే 40 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. మరో కీలకమైన బలిజ సామాజికవర్గం ప్రజల్లో 40 శాతం మంది వైసీపీకి, 50 శాతం మంది టీడీపీకి, 10 శాతం ఇతరులకు వేస్తామంటున్నారు. అలాగే ముస్లింలలో 60 శాతం మంది అధికార పార్టీకి, 30 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామని సర్వేలో తెలిపారు. యాదవుల్లో వైసీపీకి 40 శాతం, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి 50 శాతం, ఇతరులకు 10 శాతం సపోర్ట్ ఇస్తామని చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

గంగుల బ్రిజేంద్ర రెడ్డి VS భూమా అఖిలప్రియ

ఇప్పటికిప్పుడు ఆళ్లగడ్డలో ఎన్నికలు జరిగితే గెలిచే అవకాశాలు వైసీపీ అభ్యర్థి అయిన గంగుల బ్రిజేంద్ర రెడ్డికే ఉన్నాయి. ఆయనకు 47 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నుంచి ఒకవేళ భూమా అఖిలప్రియ బరిలో దిగితే 39 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఇతరులు 14 శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. గంగుల బ్రిజేందర్ రెడ్డి గత ఐదేళ్ల కాలంలో ఆళ్లగడ్డలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గెలుపు అవకాశాలు పెంచుతున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది.

.

.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×