E-Paper
Advertisement

Uravakonda Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఉరవకొండలో నిలిచి గెలిచేదెవరు ?

Uravakonda Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఉరవకొండలో నిలిచి గెలిచేదెవరు ?
Advertisement
Andhra news today

Uravakonda Assembly Constituency(Andhra news today):

ఉరవకొండ సెగ్మెంట్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతుంటాయి. ఇక్కడ టీడీపీ నుంచి సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ 1994 నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే నాలుగు పర్యాయాలు గెలిచారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాన పార్టీల మధ్య ఓట్ షేర్ వ్యత్యాసం కేవలం ఒకటి రెండు శాతంగానే ఉంటూ వస్తోంది. ఏకపక్షంగా గెలిచిన సందర్భాలు ఉండడం లేదు. చాలా టఫ్ ఫైట్ ఉత్కంఠ మధ్యే అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. ఇక గత మూడు పర్యాయాలు పోటీ టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయిందిక్కడ. ఉరవకొండ నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులుగా టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, వైసీపీ నుంచి వై.విశ్వేశ్వర రెడ్డి ఉంటూ వస్తున్నారు. ఉరవకొండ సెగ్మెంట్ లో ఆసక్తికర విషయం మరొకటి ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే… ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. ఇది యాదృచ్చికమే అయినా ఆసక్తికర విషయంగా మారింది. 2004 నుంచి ఇది జరుగుతోంది. 2004, 2009లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇప్పుడు 2014లో వైసీపీ అభ్యర్థి గెలవగా.. టీడీపీ సర్కార్ ఏర్పాటైంది. ఇక 2019లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా.. వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఉరవకొండ సెగ్మెంట్ కు సంబంధించి ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మరి ఉరవకొండ నియోజకవర్గం ఓటరు నాడి ఈ ఎన్నికల్లో ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

2019 RESULTS

Advertisement

వై.విశ్వేశ్వర రెడ్డి VS పయ్యావుల కేశవ్ (టీడీపీ-గెలుపు)

2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ 48 శాతం ఓట్లు రాబట్టి గెలిచారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి వై. విశ్వేశ్వర రెడ్డి 47 శాతం ఓట్లు రాబట్టి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇతరులు 5 శాతం ఓట్లు సాధించారు. ఒకవైపు జగన్ వేవ్, వైసీపీ హవా కొనసాగినా.. ఈ ఉరవకొండ సీటును పయ్యావుల కేశవ్ తన అభివృద్ధి పనులు సొంత ఇమేజ్ కారణంగా తక్కువ మార్జిన్ తో నిలుపుకోగలిగారు. మరి ఈసారి ఎన్నికల్లో ఉరవకొండ సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Advertisement

వై.విశ్వేశ్వర రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

ఉరవకొండలో కీలక నేతగా గుర్తింపు
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం
ఓడినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండడం

వై.విశ్వేశ్వర రెడ్డి మైనస్ పాయింట్స్

శివరామిరెడ్డితో అభిప్రాయబేధాలు
ఉరవకొండలో వైసీపీ రెండు వర్గాలుగా మారడం
శివరామిరెడ్డి టిక్కెట్ కు పోటీగా రావడం

ఎల్లారెడ్డిగారి శివరామి రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

ఉరవకొండలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు
ఎమ్మెల్సీగా ఉంటూ చేస్తున్న పనులు

పయ్యావుల కేశవ్ (TDP) ప్లస్ పాయింట్స్

నియోజకవర్గంలో సీనియర్ గా గుర్తింపు
జనంలో, క్యాడర్ లో మంచి ఇమేజ్
ప్రజలకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండడం
ఎలాంటి ఆరోపణలు, అభియోగాలు లేకపోవడం
నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం పోరాడడం
ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా
వైసీపీలో అంతర్గత విబేధాలు కలిసి వచ్చే ఛాన్స్
టీడీపీ క్యాడర్ కేశవ్ పనితీరుపై సంతృప్తి
సెగ్మెంట్ లో మరింత యాక్టివ్ అయిన పయ్యావుల
ఇటీవలే సొంత భూమిని పేదల ఇళ్లకోసం పంచిపెట్టడం

పయ్యావుల కేశవ్ మైనస్ పాయింట్స్

జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరత
జీడిపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం అందకపోవడం
కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి లేకపోవడం
సెగ్మెంట్ లో చాలా వరకు దెబ్బతిన్న రోడ్లు

ఇక వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

వై.విశ్వేశ్వర రెడ్డి VS పయ్యావుల కేశవ్

ఉరవకొండలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీడీపీకే గెలువు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ కు 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి 46 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. ఇక ఇతరులు 5 శాతం ఓట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ కు ఉన్న పర్సనల్ ఇమేజ్ తో ఆయన వైపే జనం మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది. అన్ని సామాజికవర్గాల నుంచి ఓట్లు రాబట్టుకోగలిగే కెపాసిటీ ఉండడం మరో ప్లస్ పాయింట్ గా ఉంది. ప్రస్తుతం పయ్యావుల కేశవ్ అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అభివృద్ధి కోసం రాజీ పడకపోవడం పాజిటివ్ గా మారింది. అలాగే వైసీపీలో ప్రస్తుతం రెండు వర్గాలుగా ఉండడం కూడా మరో ప్లస్ పాయింట్ గా మారుతోంది. అదే సమయంలో వైసీపీకి ఓట్ షేర్ రావడంలో విశ్వేశ్వరరెడ్డి పాజిటివ్ ఇమేజ్ ఉపయోగపడుతోంది. దీంతో పాటే ప్రభుత్వం నుంచి వివిధ స్కీంల రూపంలో లబ్దిపొందుతున్న ప్రజల మద్దతు కూడా బలంగా కనిపిస్తోంది. ఏదేమైనా టీడీపీ, వైసీపీ మధ్య తక్కువ ఓట్ మార్జిన్ తోనే గెలిచే అవకాశాలు ఉరవకొండలో కనిపిస్తున్నాయి.

.

.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×