E-Paper
Advertisement

BJP : ఏపీలో బీజేపీ వ్యూహం మార్చిందా..? త్వరలో పార్టీ కార్యవర్గంలో మార్పులు..?

BJP : ఏపీలో బీజేపీ వ్యూహం మార్చిందా..? త్వరలో పార్టీ కార్యవర్గంలో మార్పులు..?
Advertisement

BJP : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ స్టాండ్ మారుతోందా? వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ పెరగబోతోందా? ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకనుంచి మరో లెక్క అన్నట్టు అధిష్టానం ఫోకస్ పెంచింది. అందులో భాగంగా కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

పార్టీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి.. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కేంద్రం నిధుల విషయంలో సహకరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వాడుకోలేకపోతోందని మాటలదాడి పెంచారామె.

Advertisement

మరోవైపు.. ఏపీ బీజేపీ సహ ఇంఛార్జ్‌ సునీల్ దియోధర్‌ను కూడా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దియోధర్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. సోమును తప్పించిన అధిష్టానం సునీల్ దియోధర్‌ను కూడా సాగనంపే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టే నాయకుడ్ని ఏపీకి పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆయనను జాతీయ కార్యవర్గంలోకి సైతం తీసుకోలేదు. దూరం పెట్టారు. ఢిల్లీలో పార్టీ పెద్దల్ని పురందేశ్వరి కలిసిన తర్వాత.. రాష్ట్ర కార్యవర్గం కూర్పు కూడా ఫైనల్ అవుతుందని చెప్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కేలా ఉంటుందని భావిస్తున్నారు.

Related News

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

Big Stories

Advertisement
×