E-Paper
Advertisement

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
Advertisement

Road Accident: కొత్తసంవత్సరం అంతా బాగుండాలని, ఎలాంటి విషాదాలు వద్దని ఎంత కోరుకున్నా.. కొన్ని సంఘటనలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో.. మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎదురుగా వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఎస్సై నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. పాపాయిపల్లికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ఎదురుగా గిద్దలూరు నుంచి వస్తున్న బొలెరో వాహనం బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×