E-Paper
Advertisement

Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఈసారి ఏమి జరుగునో..?

Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఈసారి ఏమి జరుగునో..?
Advertisement

Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. నాలుగు రోజుల వ్యవధిలో అవినాష్ రెడ్డి రెండుసార్లు విచారణకు డుమ్మాకొట్టారు.

తొలుత ఈ నెల 16న అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ లోనే ఉన్న అవినాష్ రెడ్డి ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ సీబీఐకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చి పులివెందుల వెళ్లిపోయారు. అదే రోజు సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విచారణ రావాలని కోరింది.

Advertisement

శుక్రవారం సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరుకాలేదు. తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని సీబీఐకు తన లాయర్ ద్వారా లేఖ పంపారు. తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నందున తల్లిని తాను చూసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మరి సీబీఐ తాజా నోటీసుల నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా..? రాకపోతే సీబీఐ తీసుకునే స్టెప్ ఏంటి..? దీనిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×