BigTV English
Advertisement

Jr NTR: ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు తార‌క్ గైర్హాజ‌రు.. క్లారిటీ వ‌చ్చేసింది

Jr NTR: ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు తార‌క్ గైర్హాజ‌రు.. క్లారిటీ వ‌చ్చేసింది

Jr NTR: స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాలు శ‌నివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌ల‌కు తెలుగు సినీ ఇండ‌స్ట్రీ నుంచి అగ్ర హీరోలంద‌రూ పాల్గొంటున్నారంటూ ప్ర‌మోట్‌ చేసుకుంటూ వ‌చ్చారు. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ హీరోలెవ‌రూ ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు హాజ‌రు కావ‌టం లేదు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సైతం ఈ వేడుక‌ల‌కు హాజ‌రు కావ‌టం లేద‌ని క‌న్‌ఫ‌ర్మ్ న్యూస్ వ‌చ్చేసింది. ఎన్టీఆర్ పి.ఆర్ టీమ్ దీనిపై వివ‌రణ ఇస్తూ ఇన్‌ఫ‌ర్మేష‌న్‌ను ఇచ్చేశారు.


తాత‌గారంటే ఎంతో ప్రేమ‌, భ‌క్తి భావం చాటుకునే తార‌క్ ఆయ‌న శ‌త జ‌యంతి వేడుక‌ల‌కు ఎందుకు వెళ్ల‌టం లేద‌నే దానిపై కూడా ఆయ‌న టీమ్ వివ‌ర‌ణ ఇచ్చుకుంది. హైద‌రాబాద్‌లో జ‌ర‌గుతున్న ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు జ‌రిగే రోజు, జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు ఒకేరోజున కుదిరింది. త‌న పుట్టిన రోజుకు ఎన్టీఆర్ ముందుగానే ప్లాన్స్ చేసుకోవటం వ‌ల్ల‌, వాటిని వాయిదా వేసే అవ‌కాశం లేక‌పోవ‌టం కార‌ణాల‌తో తాను తాత‌గారి శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు హాజ‌రు కావ‌టం లేద‌ని ఎన్టీఆర్ త‌న పి.ఆర్ టీమ్ ద్వారా ఇన్‌ఫ‌ర్మేష‌న్‌ను అందించారు. శ‌త జ‌యంతి నిర్వాహ‌కుల నుంచి ఆహ్వానం అందిన‌ప్పుడు తారక్ ఈ విష‌యాన్ని వారికి తెలియ‌జేశారట‌.

శ‌నివారం జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లను ఆయ‌న అభిమానులు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ప్ర‌స్తుతం చేస్తోన్న పాన్ ఇండియా మూవీకి దేవ‌ర అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అలాగే ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్‌ను కూడా రివీల్ చేశారు. ర‌గ్డ్‌లుక్‌తో ఎన్టీఆర్ మాసీ క్యారెక్ట‌ర్‌లో మెప్పించ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×