E-Paper
Advertisement

చెవులకు నొప్పి ఉండదు.. 37 గంటల బ్యాటరీతో అదరగొడుతున్న సోనీ కొత్త ఇయర్‌బడ్స్!

చెవులకు నొప్పి ఉండదు.. 37 గంటల బ్యాటరీతో అదరగొడుతున్న సోనీ కొత్త ఇయర్‌బడ్స్!
Advertisement

Sony LinkBuds Clip: సంగీత ప్రియుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సరికొత్త ఓపెన్-ఇయర్ క్లిప్ డిజైన్ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది జనవరిలో ఉత్తర అమెరికాలో లాంయ్ అయిన ఈ Sony LinkBuds Clip ఇప్పుడు భారత్‌లో అడుగుపెట్టాయి. చెవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల శబ్దాలను వింటూనే పాటలు ఆస్వాదించేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.

కొత్త డిజైన్, మరెన్నో ఫీచర్లు:

ఈ ఇయర్‌బడ్స్ చెవి లోపలి భాగాన్ని పూర్తిగా మూసేయకుండా క్లిప్ తరహా డిజైన్‌తో వస్తాయి. దీనివల్ల వీటిని ఎక్కువ సమయం పెట్టుకున్నా ఎలాంటి నొప్పి ఉండదు. పైగా, పాటలు వింటున్నప్పుడు పక్కవారితో మాట్లాడటం సులువవుతుంది. చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం దీనికి ఐపీఎక్స్4 రేటింగ్ ఇచ్చారు. ఇందులో అమర్చిన 10 ఎంఎం డ్రైవర్లు, సోనీ డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ టెక్నాలజీ వల్ల ఆడియో క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. సోనీ కనెక్ట్ యాప్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన విధంగా సౌండ్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

అద్భుతమైన మూడు మోడ్స్:

Advertisement

వినియోగదారుల సౌకర్యార్థం సోనీ ఇందులో 3 రకాల లిజనింగ్ మోడ్స్‌ను అందించింది. రోజువారీ వాడకానికి స్టాండర్డ్ మోడ్ ఉపయోగపడితే.. ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారి వాయిస్ క్లియర్‌గా వినిపించడానికి ‘వాయిస్ బూస్ట్’ మోడ్ సహాయపడుతుంది. ఇక మూడోదైన ‘సౌండ్ లీకేజ్ రిడక్షన్’ మోడ్ ద్వారా మనం వినే పాటలు పక్కవారికి వినిపించకుండా కంట్రోల్ చేయవచ్చు. వాకింగ్, రన్నింగ్, జిమ్ వంటి పనులను బట్టి ఇది ఆటోమేటిక్‌గా సౌండ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది.

Also Read: మొబైల్‌లో సిమ్ కార్డ్ లేకపోయినా.. ఎమర్జెన్సీ కాల్ ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసా?

స్పష్టమైన వాయిస్ కాల్స్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్‌లో డ్యూయల్ మైక్రోఫోన్లు, బోన్ కండక్షన్ సెన్సార్, ఏఐ ఆధారిత సిగ్నల్ ప్రాసెసింగ్ ఉన్నాయి. ఇవి చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ లేదా ఇతర నాయిస్‌ను తగ్గించి, మన వాయిస్‌ను అవతలి వారికి చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తాయి. దీనికి బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంది. తద్వారా ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ జెమిని అసిస్టెంట్‌ను హ్యాండ్స్-ఫ్రీగా వాడుకునే వీలుంది.

37 గంటలు నాన్‌స్టాఫ్ మ్యూజిక్:

బ్యాటరీ పరంగా సోనీ లింక్‌బడ్స్ క్లిప్ అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఇయర్‌బడ్స్ 9 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే మొత్తంగా 37 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. కేవలం మూడు నిమిషాల క్విక్ ఛార్జింగ్‌తో గంటపాటు వాడుకోవచ్చు. మన దేశంలో దీని ధర రూ.18,990గా నిర్ణయించారు. ఇవి నలుపు, గ్రేజ్, గ్రీన్, లావెండర్ రంగుల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా వంటి ప్రధాన స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

Also Read: కష్టపడి రుద్దాల్సిన పనిలేదు.. ఈ 5 పదార్థాలతో వంటగది జిడ్డు చిటికెలో మాయం!

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×