E-Paper
Advertisement

కొత్తింట్లో శృతి హాసన్ గృహప్రవేశం.. ఆ ఇంటి ప్రత్యేకతలు చూస్తే ఔరా అనాల్సిందే..!

కొత్తింట్లో శృతి హాసన్ గృహప్రవేశం.. ఆ ఇంటి ప్రత్యేకతలు చూస్తే ఔరా అనాల్సిందే..!
Advertisement

Shruthi Haasan : టాలీవుడ్, కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని ఏళ్లకే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. మొదట్లో ఐరన్ ఎక్కువగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు… పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి.. ప్రస్తుతం సింగర్ గా రాణిస్తూనే సినిమాలలో ఐటమ్ సాంగ్లు చేస్తూ బిజీగా మారింది.. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన పెళ్లి మూవీలో ఐటమ్ సాంగ్ లో కనిపించే జనాలని ఆకట్టుకుంది. అయితే శృతిహాసన్ ఎప్పుడు తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. శృతి హాసన్ కొత్తింటికి అడుగుపెట్టింది. ఆమె గృహప్రవేశం చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటి ఖరీదు? ప్రత్యేకతలు? ఎక్కడ ఇల్లు కొన్నారు? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

శృతి హాసన్ కొత్తింటి గృహప్రవేశం..

సినీ హీరోయిన్, గాయని శృతి హాసన్ జీవితంలో మరో అధ్యాయం ప్రారంభం అయ్యింది. ఎన్నో హిట్ సినిమాలల్లో నటించిన ఆమె విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. చెన్నై లో ఖరీదైన ఇంటిని ఈమె కొనుగోలు చేసిందని తెలుస్తుంది. టెక్నాలజీకి తగ్గట్లుగా అన్ని సదుపాయాలు ఉండేలా ఆ ఇంటిని తన డ్రీమ్ హౌస్గా నిర్మించుకుందట.. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెన్నైలో ఖరీదైన ఇల్లు కొనాలన్నా తన కోరికను బయటపెట్టింది. ఇన్నాళ్లకు ఆ కోరికను తీర్చుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను శృతిహాసన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవడంతో.. శృతిహాసన్ సాంప్రదాయంగా చాలా బాగుంది అంటూ ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇల్లు మాత్రం చాలా బాగుంది అని కొందరు, పెళ్లెప్పుడు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ కామెంట్స్ పై శృతిహాసన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

గృహప్రవేశంలో కమల్ హాసన్ మిస్సింగ్..

Advertisement

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె నాస్తికురాలునని చెప్పిన విషయం తెలిసిందే.. అప్పుడు నేను పూజలు చేయను అని చెప్పినా శృతిహాసన్ ఇప్పుడు గృహప్రవేశం నాడు పూజ చేస్తూ కనిపించడం పై గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీనిపై నిటిజన్లు భిన్నంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇదిలా ఉండగా తన కూతురు గృహప్రవేశం చేస్తుంటే కన్నతండ్రిగా కమలహాసన్ కనిపించకపోవడం పై నెట్టింట ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సారికతో పాటు సోదరి అక్షర హాసన్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.. అసలు ఎందుకు కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి రాలేదు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక శృతిహాసన్ సినిమాల విషయానికొస్తే.. కమలహాసన్ వారసురాలుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వెండితెరపై అంతగా కనిపించక పోయినా సరే.. ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సింగర్ గా దూసుకుపోతుంది. మరి ఈమె నెక్స్ట్ సినిమాని ఎప్పుడూ అనౌన్స్ చేస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Also Read :ధనుష్ జీవితంలో ట్విస్ట్.. భార్య చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..!

Advertisement

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×