E-Paper
Advertisement

Amaravati: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు

Amaravati: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు
Advertisement

Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపుపై ఫోకస్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే తన కాన్వాయ్‌లోని సగానికి పైగా వాహనాలను తగ్గించుకున్న సీఎం చంద్రబాబు, తాజాగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ విధానాన్ని పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే

Advertisement

ఇరాన్‌పై అమెరికా యుద్ధం చేయలేదు. కాకపోతే మార్చి నెలలో జరిగిన పరిణామాలు, మరోవైపు ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్భంధనం చేయడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా సూచించారు.

ముఖ్యంగా బంగారం కొనుగోలు, ఇంధనం పొదుపు, వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ఆయన సూచనలు చేశారు. ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ విధానం తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీ సూచనల తర్వాత ఏపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.

Advertisement

వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు

వర్క్‌ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రభుత్వ రంగంలో అమలు చేస్తామని చెప్పకనే చెప్పారు. కాబోయే రోజుల్లో ఇంట్లో కూర్చొని పని చేసే పరిస్థితి రానున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. దీనివల్ల అనవసర ప్రయాణాలు తగ్గుతాయని, టెలి-వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం అమలు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉందంటున్నాయి. ఈ క్రమంలో ఇంటి నుంచి పని చేసేవారు.. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని రెండు వర్గాలుగా విభజించే అవకాశం ఉందంటున్నారు.

ALSO READ: కృష్ణమ్మ కంట కన్నీరు.. అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్.. తెలుగు రాష్ట్రాలకు తప్పని జలగండం?

అలా కాని పక్షంలో వర్క్ ఫ్రం హోమ్‌తో పాటు హైబ్రిడ్ విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. అంటే వారంలో మూడు రోజులు ఆఫీసు, మూడు రోజులు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని పరిశీలన చేస్తున్నారట. గురువారం జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి వెంటనే ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నాయి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×