BigTV English

Chandrababu Naidu: అప్పుడు కోడికత్తి డ్రామా.. ఇప్పుడు గులకరాయి డ్రామా..!

Chandrababu Naidu: అప్పుడు కోడికత్తి డ్రామా.. ఇప్పుడు గులకరాయి డ్రామా..!

Chandrababu Naidu Speech in Visakhapatnam Prajagalam Meeting: గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం గుప్పించారు. విశాఖ ప్రజాగళంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నగర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ ప్రజలు చాలా తెలివైన వారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో నగర వాసులు ఎంతో ముందుచూపుతో విజయమ్మను ఓడించారని తెలిపారు.


తాము అధికారంలోకి వచ్చాక రాజకీయ రౌడీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలకు విశాఖ ఆస్తులపైనే మక్కువని.. ప్రజలపై కాదని తేల్చిచెప్పారు. వారు విశాఖలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. తన జీవితంలో తప్పు చేయలేదని.. అందుకే ఎవరికి భయపడనని టీడీపీ బాస్ స్పష్టం చేశారు. జైలులో ఉన్నప్పుడు తనని చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఇక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హింసించారని.. అనేక ఇబ్బందులకు గురిచేశారని.. మానసికంగా వేధించారని అన్నారు.

Also Read: Suriya Daughter Dia: ఇంటర్ రిజల్ట్స్ లో అదరగొట్టిన సూర్య-జ్యోతిక కూతురు..


సొంత చెల్లి చీర రంగు గురించి మాట్లాడే అన్నయ్య ఉంటాడా అని చంద్రబాబు సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఇక కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. మూడోసారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనేని అన్నారు. కేంద్రంలో మోదీ గ్యారంటీలు ఉన్నాయని.. రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఉన్నాయని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో సర్వనాశనం చేశారని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తామన్నారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×