BigTV English
Advertisement

Venkatesh Elections Campaign: తస్సాదియ్యా.. వెంకీ మామ.. ఏమన్నా ప్రచారమా అసలు.. అదరగొట్టావ్ పో!

Venkatesh Elections Campaign: తస్సాదియ్యా.. వెంకీ మామ.. ఏమన్నా ప్రచారమా అసలు.. అదరగొట్టావ్ పో!

Victory Venkatesh Elections Campaign 2024: విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి వివాదాలు లేని హీరో అంటే వెంకీ మామ పేరే చెప్తారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న వెంకటేష్ తన బంధువుల కోసం మొట్ట మొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక అయన తరఫున ఎన్నికల ప్రచారంలో వెంకటేష్ పాల్గొన్నాడు.


కలిదిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించాడు. వెంకీ మామ ఎక్కడ ఉంటే అక్కడ హంగామా ఉండాల్సిందే. ఆయన ఎక్కడ ప్రచారం చేసినా సందడి వాతావరణం నెలకొంది. శ్రీను మామను గెలిపించండి అంటూ తనదైన శైలిలో మాట్లాడి అభిమానులను అలరించాడు. అసలు ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ ఈ రేంజ్ లో మాట్లాడతాడు అనేది ఎవరు ఊహించలేదని చెప్పొచ్చు. ” మీ అందరిని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఏంటీ ప్రేమ, ఏంటీ ఉత్సాహం.. బాబు.. తమ్ముడు .. అమ్మ.. అక్క .. అందరూ శ్రీను మామకు ఓటేసి గెలిపించాలి. మీకు కష్టం వస్తే వెంటనే వచ్చేస్తాడు.. అలాంటి మనిషిని గెలిపించండి. మీ కష్టాలు పోవాలంటే మే 13 న ఓటు వేయాలి. అది మీ హక్కు.. మీ బాధ్యత.. మీ భవిష్యత్తు బాగుండాలంటే ఓటు వేయాలి.

Also Read: CM Jagan: ‘పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చంద్రబాబు సంసారం’


కామినేని శ్రీను మామకు ఓటు వేయాలి. ఆయన మీకెప్పుడు అండగా ఉంటాడు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంతసేపు ఎదురుచూసారు. భోజనం లేకుండా ఇక్కడే ఉన్నారు. ఇంటికెళ్లి భోజనం చేసి పడుకోండి.. మే 13 న అందరూ ఓటు వేయండి. అరెరే ఈ సౌండ్ ఏంటమ్మా.. మీ పెళ్లికాని ప్రసాద్ వచ్చాడు.. మీ తులసి, మీ చంటి, మీ గణేష్.. అప్పుడు సినిమాలో.. ఇప్పుడు ఓటు మీది చాలా ముఖ్యం.. అందరూ ఓటు వేయండి” అంటూ ప్రజలను తన మాటలతో అలరించాడు. ఇక ఈ వీడియో చూసినా వెంకీ మామ అభిమానులు తస్సాదియ్యా.. వెంకీ మామ.. ఏమన్నా ప్రచారమా అసలు.. అదరగొట్టావ్ పో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×