Best 8kg front load washing machine: వాషింగ్ మెషీన్ కొనడం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ముఖ్యమైన పెట్టుబడి. సరిగ్గా రీసెర్చ్ చేయకుండా.. ఏదో ఒక మోడల్ కొనేస్తే తర్వాతి కాలంలో కరెంట్ బిల్లులు, వాటర్ ప్రాబ్లమ్స్, రిపేర్లతో తల పట్టుకోవాల్సి వస్తుంది. అందులోనూ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు బట్టలను చాలా శుభ్రంగా ఉతకడంతో పాటు నీటిని, కరెంట్‌ను కూడా బాగా ఆదా చేస్తాయి. అయితే 8 కేజీల కెపాసిటీ ఉన్న ఫ్రంట్ లోడ్ మెషీన్‌ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కింది 5 విషయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి.
వాషింగ్ మెషీన్‌కు మోటార్ చాలా ముఖ్యం. ఇప్పుడు మార్కెట్లో.. వస్తున్న లేటెస్ట్ ఫ్రంట్ లోడ్ మెషీన్లలో ‘డైరెక్ట్ డ్రైవ్’ లేదా ‘డిజిటల్ ఇన్వర్టర్ మోటార్’ వస్తున్నాయి. ఇవి చాలా సైలెంట్‌గా పని చేయడమే కాకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అలాగే స్పిన్ స్పీడ్ కూడా చాలా ముఖ్యం. నిమిషానికి 1200 నుంచి 1400 ఆర్‌పిఎం స్పీడ్ ఉన్న మెషీన్లు బట్టలోని నీటిని పూర్తిగా పిండేసి, త్వరగా ఆరి పోయేలా చేస్తాయి.
ఫ్రంట్ లోడ్ మెషీన్లు జనరల్‌గా టాప్ లోడ్ మెషీన్ల కంటే.. తక్కువ నీటిని వాడతాయి. అయితే.. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్న మోడళ్లను ఎంచుకోవడం వల్ల.. కరెంట్ బిల్లు భారీగా సేఫ్ అవుతుంది. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మనకూ ఆర్థికంగా భారం తప్పుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ లేబుల్ కచ్చితంగా చెక్ చేసుకొని కొనడం బెస్ట్.
క్లాత్ క్వాలిటీ అన్నింటివీ ఒకేలా ఉండదు. సిల్క్, కాటన్, ఉన్ని బట్టలకు వేర్వేరు.. కేర్ అవసరం. 8 కేజీల ఫ్రంట్ లోడ్ మెషీన్‌లో అలర్జీ కేర్, బేబీ కేర్, క్విక్ వాష్ వంటి కనీసం 10 నుంచి 15 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే ‘స్టీమ్ వాష్’ ఫీచర్ ఉన్న మెషీన్లు బట్టలపై ఉండే బ్యాక్టీరియా, క్రిములను 99.9% వరకు తొలగిస్తాయి. ఇది పిల్లలున్న ఇళ్లలో చాలా ఉపయోగ పడుతుంది.
మనలో చాలా మందికి వేడి నీటితో బట్టలు ఉతకడం వల్ల మురికి ఈజీగా పోతుందనే విషయం తెలుసు. అందుకే బిల్ట్-ఇన్ హీటర్ ఉన్న ఫ్రంట్ లోడ్ మెషీన్‌ను ఎంచుకోవడం మంచిది. ఇది నీటి.. ఉష్ణోగ్రతను 30 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు అవసరానికి తగినట్లుగా మలుచుకుంటుంది. అలాగే .. మీ ప్రాంతంలో నీరు ఉప్పు నీరు అయితే, దాన్ని తట్టుకునే ప్రత్యేక టెక్నాలజీ ఉన్న మెషీన్‌ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలా? జియో,ఎయిర్‌టెల్, ఎక్సిటెల్ 300 Mbps ప్లాన్లలో ఏది బెస్ట్?
ఎంత మంచి బ్రాండ్ అయినా.. ఎలక్ట్రానిక్ వస్తువు కాబట్టి కొన్నిసార్లు రిపేర్లు రావచ్చు. కాబట్టి.. కంపెనీ ఇస్తున్న మోటార్ వారంటీ (సాధారణంగా 10 నుంచి 20 సంవత్సరాలు ఇస్తారు), బెస్ట్ మెషిన్ వారంటీని ఎంచుకోవాలి. అలాగే మీ ఏరియాలో ఆ బ్రాండ్ కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో ముందే ఆరా తీయడం చాలా మంచిది.
మీ కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఒక మంచి 8 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను ఇంటికి తెచ్చుకోవాలంటే.. పైన చెప్పిన 5 అంశాలను తప్పకుండా చెక్ చేయడం అవసరం. తొందర పడి ఏదో ఒకటి కొనేయకుండా.. ఫీచర్లు, బడ్జెట్ సరిగ్గా సరి పోయే పర్ఫెక్ట్ మెషీన్‌ను ఎంచుకుని మీ బట్టలు ఉతికే సమస్యను ఈజీ చేసుకోండి!