E-Paper
Advertisement

Chandrababu strong warning: చంద్రబాబు వార్నింగ్.. తగ్గు, తాట తీస్తా, రెచ్చిపోవద్దు..

Chandrababu strong warning: చంద్రబాబు వార్నింగ్.. తగ్గు, తాట తీస్తా, రెచ్చిపోవద్దు..
Advertisement

Chandrababu warning to YCP leaders: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. పార్టీల ప్రచారాలు కూడా తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా అధికార పక్షాన్ని కాసేపు పక్కనబెడితే, విపక్ష టీడీపీ మాత్రం గడిచిన ఐదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశారో కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మీరు గెలిపించిన ఎమ్మెల్యేల తీరు ఇలా ఉంటే, ఆ పార్టీ అధినేత జగన్ తీరు ఇంకా ఎలాగ ఉంటుందోనని ప్రశ్నించారు.

అధికార పార్టీ అరాచకాలకు మే 13తో పీడ వదిలించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెనాలి చరిత్రలో ఎప్పుడూ జరగని అరాచకాలు గడిచిన ఐదేళ్లలో జరిగాయని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన సెంటు పట్టా కోసం సేకరించిన భూముల్లో దాదాపు 80 కోట్ల రూపాయలను అధికార పార్టీ ఎమ్మెల్యే నొక్కేశారని ఆరోపించారు. వెంచర్లు వేయాలన్నా, అపార్ట్‌మెంట్ కట్టాలన్నా స్థానిక ఎమ్మెల్యేకు పన్ను కట్టాల్సిందేనని ధ్వజమెత్తారు.

Advertisement

ఇప్పుడు కొత్తగా శివకుమార్ ట్యాక్స్ వచ్చిందని, రేపటి రోజున మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే పన్నులు కట్టేందుకు చట్టం తీసుకొస్తుందని మండిపడ్డారు టీడీపీ అధినేత. ఆర్య వైశ్య సామాజికి వర్గానికి చెందిన ఓ కౌన్సిలర్‌పై దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖబడ్దార్.. జాగ్రత్తగా లేకుంటే తాట తీస్తామని హెచ్చరించారు టీడీపీ అధినేత. మీ గుట్టు అంతా తనకు తెలుసని, అనవసరంగా రెచ్చిపోవద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.

ALSO READ: పోలవరం నిర్వాసితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం

Advertisement

ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ రోడ్ షో జరిగింది. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Big Stories

Advertisement
×