Big Stories

Puchalapalli Sundaraiah: ఆడంబరాలకు దూరంగా ఉంటూ పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన గొప్ప నేత జయంతి నేడు

Puchalapalli Sundaraiah: నాయకుడు అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడని.. కుర్చీకి పరిమితమయ్యేవాడు నాయకుడు కాదని చాటి చెప్పిన నేత పుచ్చలపల్లి సుందరయ్య. అంతేకాదు.. పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లి నిరాడంబరుడిగా పేరొందిన నేత పుచ్చలపల్లి సుందరయ్య. నేడు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి. విప్లవ పోరాట చరిత్రలో త్యాగాలు, ఉద్యమ నిర్మాణాలకు పుచ్చలపల్లి సుందరయ్య చిరునామా అని అంటారు.

- Advertisement -

పుచ్చలపల్లి సందరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడులో 1913 మే 1న జన్మించారు. రాజమండ్రి, మద్రాసులో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన పుచ్చలపల్లి సందురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. అజ్ఞాతంలో ఉండి పోరాటాన్ని ముందుకు నడిపించిన ఘనత ఆయనది. 1928లో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కూడా పుచ్చలపల్లి సుందరయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: నేడే మేడే.. ఇంతకు మేడే అంటే ఏమిటి..? మేడే ఎప్పట్నుంచి స్టార్టయ్యింది??

ప్రజాసంక్షేమమే పరమావధిగా.. ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమై ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ఆరు దశాబ్ధాలకుపైగా రాజకీయ జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. నిత్యమూ పేదల బాగు కోసం పుచ్చల పల్లి సుందరయ్య అహర్నిశలు కృషి చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News