E-Paper
Advertisement

CM Chandrababu:ఎంపీ పుట్టా మహేష్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ఇలాంటి వాళ్లను మోయాలా?

CM Chandrababu:ఎంపీ పుట్టా మహేష్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ఇలాంటి వాళ్లను మోయాలా?
Advertisement

CM Chandrababu: మెయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా హీటెక్కింది. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సిట్‌కు అప్పగించడంతో కొత్త మలుపు తిరిగింది. దీంతో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. ఫామ్‌హౌస్‌లో ఆనాడు ఏం జరిగింది? ఇంతకీ ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

మెయినాబాద్ డ్రగ్స్ కేసు..  ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం

Advertisement

మెయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, ఏపీలో అధికార పార్టీని ఓ కుదుపు కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మంగళవారం తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రితో టీడీపీ అధినేత సమావేశమయ్యారు. నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

యువకుడని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని పుట్టా మహేష్‌కు అవకాశమిచ్చామని అన్నారు. కానీ ఈ విధంగా వ్యవహరించారని అన్నారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా? అంటూ మాట్లాడారు.

Advertisement

గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఈ లెక్కన ఎవరైనా నేతలు హద్దు ధాటితే చర్యలు తప్పవని హెచ్చరించే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు.

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ఇలాంటి వాళ్లను మోయాలా?

మెయినాబాద్ డ్రగ్స్ కేసులో మొత్తం 11 మంది బడాబాబులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారిలో రాజకీయ, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినవారు కావడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ శివార్లలోని ఫాంహౌస్‌లలో బడాబాబుల పార్టీలు జరగడం సాధారణమే. మొయినాబాద్‌ పార్టీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో జరిగింది.

గతంలో ఆయనపై రకరకాల ఆరోపణలు లేకపోలేదు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌తోపాటు రాజస్థాన్‌కు చెందిన నమిత్‌శర్మ పాల్గొన్నాయి. రైడ్స్ వచ్చిన పోలీసులపై కాల్పులు జరపడం కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి. మరోవైపు మద్యం పార్టీ కేసులో డ్రగ్స్‌ పాజిటివ్‌గా వచ్చిన ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ వ్యవహారశైలిపై చర్చ జరుగుతోంది. ఆయన డీ అడిక్షన్‌ కేంద్రానికి వెళ్లేందుకు నిరాకరించారని సమాచారం.

తాము న్యాయపరంగా తేల్చుకుంటామంటూ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడినవారిలో మార్పు తెచ్చేందుకు డీ అడిక్షన్‌ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ కౌన్సెలింగ్‌ తీసుకునే వారిపై నమోదైన కేసులను నిబంధనల ప్రకారం తొలగించే విధానం అనుసరిస్తోంది. ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు సుధీర్‌రెడ్డి ఈ విధంగా పట్టుబడినప్పుడు డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు.

ALSO READ: కొడుకు అట్లా.. బావమరిది ఇట్లా, ఇది రాష్ట్రంలో పాలన: వైఎస్ జగన్

అతడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మెయినాబాద్ కేసు విషయానికి వచ్చేసరికి ఆరుగురికి  పాజిటివ్‌ వచ్చింది. దీనిపై ఎంపీ పుట్టా మహేష్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు సరైన సమయంలో వివరాలు వెల్లడిస్తామని అన్నారు ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్‌బాబు. మొయినాబాద్ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతోందని, ఈ కేసులో ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×