E-Paper
Advertisement

కోడిగుడ్డు‌పై ఈకలు పీకడం.. వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

కోడిగుడ్డు‌పై ఈకలు పీకడం.. వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

Amaravati: ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై చీటికి మాటికీ లేనిపోని రాద్ధాంతం చేస్తోంది వైసీపీ. పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

 

మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు

Advertisement

మంగళవారం అమరావతి సచివాలయంలో ఏపీ ఆర్థికశాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, పనిలోపనిగా డీఎస్సీపై ఇటీవల కాలంలో వైసీపీ లేనిపోని ఆరోపణలు చేసింది.. చేస్తోంది కూడా. దీనిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి. అధికారంలోకి రాగానే  మెగా డీఎస్సీ పై తొలి సంతకం పెట్టామన్నారు.

దాదాపు 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా దాదాపు 200 పిటిషన్లు వేశారని చెప్పుకొచ్చారు. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ విషయంలో ఎవరూ నోరు ఎత్తుకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించామన్నారు సీఎం. దానిపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని, కోడిగుడ్డుపై ఈకలుపీకే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

 

వైసీపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

వాళ్లని ఏమనాలి, వాళ్లు ఎటువంటి వారో అర్థం చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేశారన్నారు. నిరాశతో ఉన్న యువత మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక నీచమైన సంస్కృతి, చాలా దారుణమని తేల్చిచెప్పారు.  గడిచిన కొద్దిరోజులుగా డీఎస్సీపై వైసీపీ లేనిపోని రాద్దాంతం చేస్తోంది. చివరకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించింది.

తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు, CPS‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం. మద్యపాన నిషేధంపై సమాధానం చెప్పలేనివాళ్లు నన్ను విమర్శిస్తున్నారా? అలాంటి వాళ్లకు సమాధానం ఒక్కటేనని ప్రజలకు చెప్పామని, వారి కోసం చేస్తామన్నారు. సంక్షేమమంటే పేదలవారికి డబ్బులు ఇవ్వడం కాదన్నారు. వారి జీవితాల్లో మార్పు తేవాలన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలన్నారు.

ALSO READ: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×