Mohammad Ashraful – Steve Waugh gloves incident: బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య రెండు టెస్టుల సిరీస్ (Bangladesh tour of Australia, 2026) ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఆగస్టు ఆరవ తేదీ నుంచి 26వ తేదీ వరకు రెండు టెస్టులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు బంగ్లాదేశ్ వెళ్ళింది. అయితే ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో 2003 సంవత్సరంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అష్రాఫూల్ (Mohammad Ashraful).
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా (Steve Waugh ) తనను మోసం చేశాడని బాంబు పేల్చాడు. తనకు ఇవ్వని.. గ్లోవ్స్ ( gloves incident) ఇచ్చినట్లు తన ఆత్మకథలో రాసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు నోరు తెరిస్తే, అబద్ధమే అంటూ ఫైర్ అయ్యారు. అతని ఆత్మకథలో అన్ని ఫేక్ ముచ్చట్లే ఉన్నాయని కూడా చురకలు అంటించారు. దీంతో స్టీవ్ వా పైన మహమ్మద్ అష్రాఫుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం పెడుతున్నాయి.
2003 సంవత్సరంలో ఆస్ట్రేలియా పర్యటనకు బంగ్లాదేశ్ వెళ్ళింది. ఆ సమయంలో మహమ్మద్ అష్రాఫూల్ (Mohammad Ashraful) కూడా జట్టులో ఉన్నాడు. అతడు వికెట్ కీపింగ్ చేసేవాడు. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ అష్రాఫూల్ కు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా సవాల్ విసిరాడు. ఆస్ట్రేలియా గడ్డపై నువ్వు అర్థ సెంచరీ నమోదు చేస్తే… స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు. తాను వాడే బ్యాటింగ్ గ్లోవ్స్ బహుమతిగా ఇస్తానని అష్రాఫూల్ ముందు సవాల్ విసిరాడు స్టీవ్ వా. ఇక దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా విసిరిన సవాల్ నేపథ్యంలో… అర్థ సెంచరీ చేసేందుకు చాలా కృషి చేశాడు మహమ్మద్ అష్రాఫూల్. కానీ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో అష్రాఫూల్ డకౌట్ అయ్యాడు.
ఈ క్రమంలో స్టీవ్ వా సవాల్ ను మహమ్మద్ అష్రాఫూల్ బ్రేక్ చేయలేక పోయాడు. అయితే తన ఆత్మకథలో మాత్రం మహమ్మద్ అష్రాఫూల్ కు గ్లోవ్స్ ఇచ్చినట్లు రాసుకున్నాడు స్టీవ్ వా. ఇదే విషయాన్ని తాజాగా మహమ్మద్ అష్రాఫూల్ ప్రస్తావించారు. తనకు ఇవ్వకున్నా… తన ఆత్మకథలో మాత్రం తప్పుడు రాతలు రాశాడని ఆగ్రహించారు. స్టీవ్ వా పెద్ద అబద్దాల కోరు అని ఆగ్రహించారు. ఒక దిగ్గజ ఆటగాడై ఉండి, ఇలా తప్పుడు రాతలు ఎందుకు రాశాడో ? తనకు అర్థం కావడం లేదని మండిపడ్డారు మహమ్మద్ అష్రాఫూల్ (Mohammad Ashraful).