BigTV English

AP CM CHANDRABABU : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్

AP CM CHANDRABABU : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్

AP CM CHANDRABABU : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో ఏదో జరుగుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మందలించారు. ఇసుక మద్యం వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు.


ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి…

ఇసుక ఉచితంగా ఇస్తున్నా, అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఏ స్థాయిలో తప్పులు జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. కూటమి సర్కారు ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వచ్చే పది రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో మార్పు రాకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. రాష్ట్రంలో ఇసుక సామాన్యులకు విరివిగా దొరకాలన్న సీఎం, అన్ని బంధనాలు తొలగించి, రవాణా, తవ్వకం ఛార్జీలు సైతం తక్కువ ధరలో అందుబాటులో ఉండాలన్నారు.


ఫ్రీగా అందించాలి…

మీరంతా ప్రజాప్రతినిధులుగా  చర్యలు తీసుకుంటూ ఉచిత ఇసుకను ప్రజలందరికీ అందించి తీరాలని అల్టిమేటం జారీ చేశారు. ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే ఎలాంటి ఫీజులు, ఛార్జీలు వసూలు చేయకూడదని సీఎం స్పష్టంగా చెప్పేశారు.

మంత్రులే బాధ్యతలు తీసుకోవాలి…

ఇక ఇసుక రవాణాలో అక్రమాలు లేకుండా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే బాధ్యతలు తీసుకుని అంతా సజావుగా నడిపించాలని సూచనలు చేశారు. ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నట్లు కొందరు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలతో ఇబ్బందులు కలిగాయన్న సీఎం, ఇకపై వేధింపులు లేకుండా చూడాలన్నారు.

Also read : హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×