BigTV English

Hyderabad : హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ

Hyderabad : హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ

Hyderabad : ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను అత్యంత ప్రణాళికాబద్ధంగా విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు అవసరమైన అన్ని చర్యలనూ తమ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో బిల్డర్స్‌తో జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. బిల్డర్స్ సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని, హైదరాబాద్ విస్తరణలో బిల్డర్స్ పాత్రను తమ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు.


బిల్డర్ల బాధలు తెలుసు – నిర్మాణ రంగంలో ఉన్న సమస్యలను అధిగమించి, భవనాలను నిర్మించే బిల్డర్ల బాధలు తమకు తెలుసునని, కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్ల సమస్యలను సానుభూతితో పరిశీలిస్తుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు బిల్డర్స్ కోరిక మేరకు బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రధాన ప్రభుత్వ శాఖల ద్వారా బిల్డర్స్ కోరుకున్న విధంగా స్పష్టత ఇప్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా మార్చేందుకు తాజా బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించామని, ఆ మొత్తాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, వరల్డ్ క్లాస్ స్టేడియాలు, స్కిల్ యూనివర్సిటీ వంటి గొప్ప ప్రాజెక్టులతో హైదరాబాద్ మరింత విస్తరించటమే గాక గ్లోబల్‌ గుర్తింపును సాధించనుందని, ఈ ప్రయత్నంలో బిల్డర్ల పాత్ర కీలకమన్నారు.

ALSO READ : టార్గెట్ జీహెచ్‌ఎంసీ


అపోహలు వీడండి – హైదరాబాద్ నగరంలోని సహజ జలవనరులుగా ఉన్న చెరువులు, కుంటలను కాపాడుకునేందుకు హైడ్రా పనిచేస్తోంది తప్ప ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచితేనే నిర్మాణరంగం కూడా బలపడుతుందని, నగర విస్తరణ ప్రణాళికాబద్ధంగా జరిగితేనే రాబోయే రోజుల్లో ఇబ్బందులు రావని వివరించారు. ఈ విషయంపై విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన వివరించారు. సంపదను సృష్టించే రంగంలోని బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తామని, బిల్డర్లంతా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఈ అంశాలపై సీఎంతో చర్చించి మరోసారి సమావేశమవుదామని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్, క్రెడాయ్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ పూర్వ అధ్యక్షులు శేఖర్, NAREDCO ప్రెసిడెంట్ విజయ సాయి, తెలంగాణ బిల్డర్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

డి ఫాల్టర్లపై కఠిన చర్యలు – తెలంగాణలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లపై క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిల్లర్లలో భేటీ అయ్యారు. రవాణా, కస్టడీ, మిల్లింగ్ చార్జీల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించిందని, ఈ అంశాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా మిల్లర్లు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తెచ్చారు. సన్న బియ్యం 100 కేజీలు బిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం వస్తుందని, 100 కేజీల దొడ్డు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కేజీల బియ్యం వస్తుందని, ఈ వాస్తవాలు తెలిసీ కొందరు తమను దోషులుగా చూపుతున్నారని మిల్లర్లు వాపోయినట్లు తెలిసింది. కాగా, గతంలో అక్రమాలకు పాల్పడిన డి ఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో ధాన్యం కేటాయించబోమని, డిఫాల్టర్లు బియ్యాన్ని మొత్తం త్వరితగతన ప్రభుత్వానికి అందజేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్ బాబులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.

Related News

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Big Stories

×