CM Chandrababu: ఎట్టకేలకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఓకే అయ్యింది. నవంబర్ 2 నుంచి 5 వరకు ఆయన లండన్‌లో పర్యటించనున్నారు. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. లండన్‌లోని పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.
సీఎం చంద్రబాబు ఫారెన్ టూర్లు
విశాఖలో గూగుల్ పెట్టుబడుల విషయం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ వ్యవహారం దేశీయ పారిశ్రామికవేత్తలు కాకుండా కొందరు ఫారెన్ వ్యాపారవేత్తలు రియాక్ట్ అయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి వచ్చిన అది పెద్ద పెట్టుబడి ఇదే. ఈ ఊపు కంటిన్యూ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 17 నెలలు అవుతోంది. ఎక్కువ శాతం పెట్టుబడులు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో యూకెలో టాప్ కంపెనీలు ఏపీకి రప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. ఈక్రమంలో నవంబర్ 2 నుంచి 5 వరకు అంటే దాదాపు మూడురోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు.
ఏపీకి పెట్టుబడులపై ఫోకస్
ఈ టూర్‌లో భాగంగా బ్రిటన్‌లో వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను అక్కడి బిజినెస్‌మేన్లకు వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను వారికి వివరించనున్నారు. విశాఖ వేదికగా నవంబర్ 14, 15 ల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది.
ఈ సదస్సుకు లండన్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం టూర్‌లో సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రాతోపాటు పలువురు అధికారుల బృందం లండన్ వెళ్లనుంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ALSO READ: మల్లన్న సేవలో పీఎం మోదీ-సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
దావోస్ తర్వాత సీఎం చంద్రబాబు ఈ మధ్యకాలంలో ఫారెన్ టూర్‌కి వెళ్లి సందర్భం లేదని పార్టీ వర్గాల మాట. బుధవారం మీడియా ముందుకొచ్చిన మంత్రి లోకేష్, నవంబర్‌లో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు లండన్ వెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుండగా ఈనెల మూడోవారం తర్వాత అంటే అక్టోబర్ 22 నుంచి రెండురోజుల పాటు దుబాయ్, అబుదాబి, యూఏఈల్లో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. విశాఖ వేదికగా జరిగే సీఐఐ సదస్సుకు అక్కడి వ్యాపారవేత్తలను ఆహ్వానించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా లాజిస్టిక్స్‌తోపాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల వ్యాపారవేత్తలకు ఆహ్వానం పలకనున్నారు. విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు వెళ్తున్నారు.