Jagan: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారా? ఫారెన్ టూర్ నుంచి అర్థాంతరంగా తిరిగి వచ్చేస్తారా? ఇకపై ఆయనకు విదేశీ పర్యటనకు న్యాయస్ణానం పర్మీషన్ ఇవ్వడం కష్టమేనా? సీబీఐ ఏ విధంగా అడుగులు వేయబోతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
జగన్ ఫారెన్ టూర్ చిక్కులు
మాజీ సీఎం జగన్ గతవారం ఐరోపా పర్యటనకు వెళ్లారు. రెండువారాల పాటు న్యాయస్థానం ఆయనకు అనుమతి ఇచ్చింది. కాకపోతే కొన్ని షరతులను విధించింది. దీని ప్రకారం జగన్ వాడుతున్న ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ సహా కొన్ని వివరాలు సీబీఐ అధికారులకు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వాటిపై షరతులు విధించి పర్మీషన్ ఇచ్చింది. ఆ తర్వాత నేరుగా న్యాయస్థానానికి హాజరుకావాలని ఆదేశించింది.
జగన్ ఇచ్చిన వివరాలపై సీబీఐ ఫోకస్ చేసింది. ఇచ్చిన ఫోన్ నంబరు జగన్‌ది కాదని సీబీఐ పరిశీలనలో తేలింది. వెంటనే ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది సీబీఐ. వేరే ఫోన్ నెంబరు ఆయన సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. వెంటనే జగన్ ఫారెన్ టూర్‌ని రద్దు చేయాలని హైదరాబాద్ సీబీఐ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది సీబీఐ.
న్యాయస్థానం దృష్టికి సీబీఐ
మెమోపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. సరైన ఫోన్ నెంబరు సమర్పించకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదిని ఆదేశించారు. దీనిపై జగన్ లాయర్ కౌంటరు దాఖలు చేసినట్టు సమాచారం. సీబీఐ వేసిన మెమోపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. దీనిపై జగన్ వైపు లాయర్ ఏం చెబుతారో చూడాలి.
ALSO READ: గురువారం ఏపీలో ప్రధాని మోదీ పర్యటన, షెడ్యూల్ ఇదే
ఆయన తరపు న్యాయవాది వాదన సరిగా లేకుంటే జగన్ టూర్ క్యాన్సిల్ కావడం ఖాయమని అంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్‌కు ఊహించని దెబ్బగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇన్నాళ్లు సరైన నెంబర్లు ఇచ్చి, ఇప్పుడు ఇవ్వకపోవడం ఏంటనే చర్చ అప్పుడే పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. ఈ లెక్కన వచ్చేఏడాది జగన్ ఫారెన్ వెళ్లాలన్నా పర్మీషన్ ఇవ్వడం కష్టమని వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో జగన్ కు ఇచ్చిన బెయిల్‌ను న్యాయస్థానం రద్దు చేస్తే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. జగన్ చేసిన ఈ పనికి, ఆ పార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలైంది.