Telusu Kada Story : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ రేపు థియేటర్స్‌లోకి రాబోతుంది. దీనికి ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్. రేపు రిలీజ్ అయ్యే ఈ మూవీలో ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ ఒకటి నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందట. ఈ సీన్ తర్వాత సినిమా ఒక్క సారిగా మారిపోతుందట. ఆ ట్విస్ట్ ఏంటి.. ఆ సీన్ ఏంటి..? అసలు తెలుసు కదా కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
జాక్ డిజాస్టర్ తర్వాత చాలా హోప్స్‌తో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న మూవీనే ఈ తెలుసు కదా. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్… అలాగే ట్రైలర్ వల్ల ఈ తెలుసు కదా సినిమా ఏంటో, దాని కథ ఏంటో ఆల్మోస్ట్ తెలిసిపోయింది.
ఇక బిగ్ టీవీకి అందుతున్న సమాచారం ప్రకారం… తెలుసు కదా మూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో డైరెక్టర్ ఓ థ్రిల్లింగ్ ట్విస్ట్ పెట్టారట. అప్పటి వరకు ఒక హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న హీరో… ఆమె పెళ్లి చేసుకుంటాడట. అయితే.. సడన్‌గా మరో హీరోయిన్ వస్తుందట.
ఆ సెకండ్ హీరోయిన్.. హీరోకు ప్రేయసినే. ఆ సెకండ్ హీరోయిన్ ప్రెగ్నెంట్ కూడా అవుతుందట. ప్రెగ్నెంట్ అయిన సెకండ్ హీరోయిన్‌ను హీరో భార్య.. మొదటి హీరోయినే.. ఇంట్లోకి ఆహ్వానిస్తుందట. ఆ ఎపిసోడ్ చూడటానికి థ్రిల్లింగ్‌గా ఉంటుందని తెలుస్తుంది.
ఇక సెకండాఫ్ మొత్తం హీరో పరిస్థితి ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అన్నట్టే సాగుతుంట. అప్పటి వరకు కూల్‌గా సాగిన మూవీ ఒక్క సారిగా టర్న్ తీసుకుంటుందట. ఇద్దరు హీరోయిన్లు… హీరో మధ్య వచ్చే సిల్లి సిల్లి సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. అయితే, కొన్ని చోట్ల మాత్రం ల్యాగ్ సీన్స్ ఉంటాయట. అవి ఆడియన్స్‌కు ఇరిటేషన్ తెప్పించేలా అనిపిస్తాయట.
ఇలాంటి కాన్సెప్ట్‌లతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. నారి నారి నడుమ మూరారి అంటూ పాత కాలం నుంచి.. ఇద్దరి హీరోయిన్లు.. ఇద్దరు భార్యలు అనే కథలతో సినిమాలు వచ్చాయి. మరి తెలుసు కదా సినిమాలో డైరెక్టర్ నీరజ కోన.. ఎలంటి కొత్తదనాన్ని చూపించారు..? ఆ కొత్తదనం ఆడియన్స్‌కు ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అనేది ఇక సినిమా రిలీజ్ అయ్యకే తెలుస్తుంది.