CM Chandrababu: కర్నూలు శివారులోని నన్నూరులో ‘సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభకు ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… విరామం, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉండే అరుదైన వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు.
‘శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీశైలం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుషాల గడ్డలో జీఎస్టీ బచత్ ఉత్సవ్ సభకు ప్రధాని హాజరు కావటం సంతోషంగా ఉంది.
జీఎస్టీ సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి ఏపీ ప్రజల తరపున అభినందనలు. ముఖ్యమంత్రిగా… ప్రధానిగా 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న మోదీకి ప్రత్యేక అభినందనలు. సరైన సమయంలో సరైన చోట సరైన వ్యక్తిగా ప్రధాని మోదీ ఓ విశిష్టమైన వ్యక్తి.. 21వ శతాబ్దపు నేత’- సీఎం చంద్రబాబు
ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పని చేసినా మోదీ లాంటి వ్యక్తిని చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. విరామం, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉంటున్నారన్నారు. ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లుగా మారాయన్నారు. ప్రగతిశీల దేశంగా 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ పవర్ గా తయారవుతుందన్నారు. 11 ఏళ్లలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు, 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్, 144 వందే భారత్ రైళ్లు, 55 వేల కి.మీ మేర కొత్త హైవేలు, 86 ఎయిర్ పోర్టులు, 16 ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మించిన ఘనత ప్రధాని మోదీదే అని ప్రశంసించారు.
7 ఐఐటీలు, 8 ఐఐఎంలను తీసుకువచ్చిన రికార్డు కూడా ప్రధాని మోదీదే ఇది ఆల్ టైం రికార్డు అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని సంకల్పంతోనే 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 4వ స్థానానికి వచ్చిందన్నారు. 2028 నాటికి 3వ, 2038కి 2వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందన్నారు. ఆర్థికంగా భారత్ బలం ఏంటో ఈ విజయాలు చెబితే.. సైనికంగా మన బలం ఏంటో ఆపరేషన్ సింధూర్ చాటిందన్నారు.
Also Read: Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ
సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 98 వేల ఈవెంట్లు నిర్వహించామని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతం లోపు పరిధిలోకి వచ్చాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్ కు డబుల్ బెనిఫిట్ వచ్చిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ అందించాయన్నారు. మెగా డీఎస్సీ, పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం-2, పింఛన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు.