BigTV English

CM Jagan : కాంగ్రెస్ డర్టీ గేమ్.. కుటుంబం చీల్చి రాజకీయం..

CM Jagan : ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామన్నారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామన్నారు.

మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని జగన్ తెలిపారు. ఈ అంశమే తమ ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనమన్నారు . కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతోందని విమర్శించారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారన్నారు. అలాగే తన కుటుంబాన్ని కూడా విభజించారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ ఏపీల చెత్త రాజకీయం చేస్తోందని సీఎం జగన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ తన బాబాయ్‌ వివేకానందరెడ్డిని మంత్రిగా చేసి తమకు వ్యతిరేకంగా పోటీ చేయించారని గుర్తు చేశారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్‌.. మరోసారి తన సోదరి షర్మిలను ప్రయోగించిందని విమర్శించారు. కాంగ్రెస్ కు దేవుడు గుణపాఠం చెబుతాడని సీఎం జగన్‌ అన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×