BigTV English

EX-Desert Knight : ఎక్సర్‌సైజ్ డెసర్ట్ నైట్‌.. భారత్, ఫ్రాన్స్, యుఏఈ వైమానిక విన్యాసాలు..

EX-Desert Knight : ఎక్సర్‌సైజ్ డెసర్ట్ నైట్‌.. భారత్, ఫ్రాన్స్, యుఏఈ వైమానిక విన్యాసాలు..
EX- Desert Knight

EX-Desert Knight : భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్తంగా డెసర్ట్ నైట్‌ ఎక్సర్‌సైజ్ (EX- Desert Knight) పేరుతో భారీ వైమానిక విన్యాసాలు చేపట్టాయి. మూడు దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్‌లు ఈ ఎక్సర్సైజ్‌లో పాల్గొన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందిన Su-30 MKI, MiG-29, జాగ్వార్, AWACS, C-130-J, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ (FASF)కు చెందిన రఫేల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్‌పోర్ట్, UAE వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.


మూడు దేశాల వాయుసైన్యం మధ్య సమన్వయం, పరస్పర సహకారం మెరుగుపరచుకునే ఉద్దేశంతో.. ఈ ఎక్సర్సైజ్ చేపట్టినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) వెల్లడించింది. ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యద్ధ విమానాలు యూఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ నుంచి ఆపరేట్ చేయగా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానాలు.. భారత ఎయిర్ బేసస్ నుంచి ఆపరేట్ చేశారు. ఇటువంటి వ్యాయామాలు IAF పరాక్రమాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఈ ప్రాంతంలో పెరుగుతున్న దౌత్య, సైనిక పరస్పర చర్యలను సూచిస్తాయి.


Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×