BigTV English

CM Jagan Press Meet : “ఏం జరిగిందో దేవుడికి తెలుసు.. నేను చేసేదేమీ లేదు” : ప్రజాతీర్పుపై జగన్ రియాక్షన్

CM Jagan Press Meet : “ఏం జరిగిందో దేవుడికి తెలుసు.. నేను చేసేదేమీ లేదు” : ప్రజాతీర్పుపై జగన్ రియాక్షన్

CM Jagan Press Meet : ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఫలితాలను తాను అస్సలు ఊహించలేదన్నారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజల తీర్పు చూసి చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించి, మంచి చేసినా ఏమైందో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు ఎంతో చేయాలని తాపత్రయ పడ్డానని, ఎన్ని మంచి పనులు చేసినా ఆ ఆప్యాయత ఎక్కడా కనిపించలేదన్నారు. అరకోటి మంది రైతుల ప్రేమ ఏమైందో, అక్కచెల్లెమ్మల ఓట్లెమయ్యాయో, అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో, కోట్లాదిమంది ప్రజల ప్రేమానురాగాలు ఏమయ్యాయో తెలియడం లేదంటూ విచారం వ్యక్తం చేశారు.


నేతన్నలు, మత్స్యకారులకు ఎంతో మంచి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం రాకముందు ఇచ్చిన చాలీచాలని పెన్షన్ ను పెంచడంతో పాటు ఎన్నో సంక్షేమాలు అందించామని, విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ తెలిపారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందించాం. మహిళలకు సంక్షేమ ఫలాలను అందించాం. 26 లక్షల అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులకు గతంలో ఎవ్వరూ చేయని మంచి చేశాం. సామాజిక న్యాయం చేసి చూపించాం. ఎంత చేసినా వాటి ఫలితం ఎన్నికల ఫలితాల్లో కనిపించలేదని జగన్ అసంతృప్తి చెందారు.

“ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను చేయగలిగింది ఏమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీని శాసించే కూటమి ఇది. కూటమిలో చంద్రబాబు, పవన్, బీజేపీకి అభినందనలు.” అని తెలిపారు జగన్.


ఏం చేసినా ఎంత చేసినా వైసీపీకి 40 శాతం ఓటింగ్ ను తగ్గించలేకపోయారన్నారు. ఏదేమైనా ప్రతి కష్టంలో తోడుగా ఉన్న నాయకుడు, ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండటం కొత్తకాదు.. పోరాటం కొత్తకాదు. మంచి చేయడానికి ప్రజలకు తోడుగా ఉంటాం. గుండె ధైర్యంతో ముందడుగు వేస్తాం. అని జగన్ తెలిపారు.

Tags

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×