Rashmika:నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి రాకముందు కొన్ని యాడ్స్ లో పనిచేసిన ఈమె.. ఆ తరువాత ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక్కడే గణేష్, పునీత్ రాజకుమార్ వంటి స్టార్ హీరోల సరసన నటించి పేరు దక్కించుకున్న ఈమె.. తెలుగులో తొలిసారి నాగశౌర్య (Naga shourya) హీరోగా నటించిన ‘ఛలో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే పర్వాలేదు అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కలిసి గీతా గోవిందం అనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చేసి మంచి సక్సెస్ అందుకుంది.
ఇక తర్వాత డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా తన నటనతో నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇటీవల తాను నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగా..”జయమ్ము నిశ్చయమ్ము రా” కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోలో చిన్ననాటి విషయాలను.. కెరియర్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకొని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ప్రమోషన్స్ లో భాగంగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె అందులో భాగంగానే తన భర్త ఎలా ఉండాలి? తన భర్త కోసం తాను ఏం చేస్తాను? అనే విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:SSMB 29: కుంభగా పృథ్వీరాజ్.. పురాణాలలో కుంభ వెనుక అసలు స్టోరీ ఏంటంటే?
రష్మిక మందన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవిత భాగస్వామి గురించి మాట్లాడుతూ తనకోసం యుద్ధం చేసే భాగస్వామి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.. “నాకోసం యుద్ధం చేయాలి. అలాంటి వ్యక్తి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే తూటాకైనా ఎదురవుతాను ” అంటూ రష్మిక వ్యాఖ్యానించింది. మొత్తానికైతే రష్మిక ఇలాంటి కామెంట్లు చేయడంతో మరి విజయ్ నీకోసం యుద్ధాలు చేస్తారా? అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంటకి ఇటీవలే రహస్యంగా ఎంగేజ్మెంట్ జరిగినట్లు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
రష్మిక సినిమాల విషయానికొస్తే.. పుష్ప, పుష్ప2, యానిమల్, ఛావా, కుబేర, థామా, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్ అంటూ వరుసగా సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకున్న ఈమె ఇప్పుడు మైసా, రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది. ఏది ఏమైనా రష్మికాకు అదృష్టం బాగా పట్టుకుంది అని చెప్పవచ్చు