E-Paper
Advertisement

Allu Arjun: పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన బన్నీ..

Allu Arjun: పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన బన్నీ..
Advertisement

Allu Arjun: జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్త చరిత్ర సృష్టించాడు. పదేళ్ల తరువాత మొదటి విజయమే రికార్డు సృష్టించాడు. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచి చూపించాడు. ఇక దీంతో పవన్ కు సోషల్ మీడియా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ విజయాన్నీ కొనియాడుతున్నారు.

తాజాగా అల్లు అర్జున్ సైతం పవన్ కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ” ఈ అద్భుతమైన విజయం అందుకున్నందుకుపవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం మరియు నిబద్ధత ఎల్లప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి. ప్రజలకు సేవ చేసే మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు.

Advertisement

పవన్ కు సపోర్ట్ గా బన్నీ ట్వీట్ చేసిన మరుసటి రోజే.. వైసీపీ నేత శిల్పారామాచంద్రారెడ్డి కోసం బన్నీ నంద్యాల వెళ్ళాడు. ఆయన తరుపున ప్రచారం చేయకపోయినా.. ఆ సమయంలో బన్నీ అక్కడకు వెళ్లడం.. పవన్ కు విరుద్ధముగా పనిచేయడమే అని అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత బన్నీ ఈ ఘటనపై క్లారిటీ కూడా ఇచ్చాడు. శిల్పా రామచంద్రారెడ్డి తనకు మంచి స్నేహితుడు అని, ఒకానొక సమయంలో ఆయనకు తోడుగా ఉంటానని మాట ఇచ్చానని.. దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే వెళ్లినట్లు తెలిపాడు.

ఇక బన్నీ అలా ఆయన ఇంటికి వెళ్లడంతో ఏమైనా అద్భుతం జరిగి.. నంద్యాలలో వైసీపీ వస్తుందేమో అనుకున్నారు.. కానీ, అక్కడ కూడా టీడీపీ రాజ్యమేలింది. దీంతో బన్నీపై పవన్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఏదిఏమైనా బన్నీ.. తానెప్పుడు మెగా ఫ్యామిలీకి అండగానే ఉంటానని చెప్పడానికి ఈ ట్వీట్ కన్నా ఎక్కువ ఇంకేమి అవసరం లేదని మరికొంతమంది తెలుపుతున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×